పది ఆపిల్స్ లో ఉండే పోషకాలు జామ పండులో ఉన్నాయా.. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!

ముఖ్యంగా చెప్పాలంటే మనకు ప్రతి సీజన్ లో కొన్ని రకాల పండ్లు లభిస్తూ ఉంటాయి.ఈ మధ్యకాలంలో సీజన్ తో సంబంధం లేకుండా మార్కెట్లో లభించే పండ్లలో జామకాయ ఒకటి అని కచ్చితంగా చెప్పవచ్చు.

 Amazing Health Benefits Of Guava,guava,health Benefits,guava Health,immunity Boo-TeluguStop.com

మార్కెట్లో జామ పండు( Guava ) ధర పేదవారికి అందుబాటులోనే ఉంటుంది.మనవాళ్లు చాలామంది ఏదైతే తక్కువ ధరకు లభిస్తుందో దాన్ని అస్సలు పట్టించుకోరు.

ఏదైతే చాలా ఖరీదుగా ఉంటుందో దానిపై దృష్టి పెడుతూ ఉంటారు.అలాంటి వాటిలో మన పెరటిలో ఉండే పండ్లలో మొదటిగా ఉండేది జామ పండు అని కచ్చితంగా చెప్పవచ్చు.

దీనిలో ఉండే పోషకాలు మనకు ఏ ఇతర పండ్లలో ఉండవు.

మనకు ఏ విధంగా జామపండు ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.ఈ పండులో పోషకాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.కొవ్వు తక్కువగా ఉంటుంది.

బరువు తగ్గాలనుకునే వారు జమ పండు తింటే చాలా మంచిది.మలబద్ధకం, డయోరియా, దగ్గు, జలుబు లాంటి వ్యాధులను తగ్గించడానికి జమ పండు ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

వీటితో పాటు విటమిన్ సి ఈ పండులో ఎక్కువగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి( Immunity Power ) మెరుగుపడుతుంది.అలాగే ఈ పండులో విటమిన్ ఏ కలిగి ఉన్నందున కంటి చూపును మెరుగుపరుస్తుంది.

జామ పండు తినడం వల్ల మలబద్ధక సమస్య దూరం అవుతుంది.

షుగర్( Diabetic Patients ) ఉన్నవారికి జమ పండు ఎంతో మంచిది.కమల పండ్లలలో దొరికే విటమిన్ సి( Vitamin C ) జమ పండులో ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది.ఇంకా చెప్పాలంటే ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిదని చాలామందికి తెలుసు.

ఆకుకూరల్లో దొరికే పీచు కంటే జామలో పీచు రెండు రెట్లు ఎక్కువగా దొరుకుతుంది.ఆపిల్ లో ఉండే పీచు పదార్థం కంటే జామలో చాలా ఎక్కువగా ఉంటుంది.10 ఆపిల్స్ లో ఉండే పోషకాలు ఒక్క జామకాయలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Health Benefits of Eating Guava

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube