ఒకప్పుడు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దుమ్మురేపిన నటీమణి నందా.ఆ రోజుల్లో తను మోస్ట్ పాపులర్ హీరోయిన్.
సుమారు మూడు దశాబ్దాలకు పైగా తన అద్భుత నటనతో యువకులు మతి పోగొట్టింది ఈ ముద్దుగుమ్మ.చోటీ బహెన్, ధూల్ కా ఫూల్, భాభీ, కాలా బజార్, కానూన్, హమ్ దోనో, జబ్ జబ్ ఫూల్ ఖిలే, గుమ్‌నామ్, ఇత్తేఫఖ్, ద ట్రైన్, పరిణీత, ప్రేమ్ రోగ్ సహా పలు అద్భుత సినిమాలతో ఆమె అద్భుత నటిగా గుర్తింపు పొందారు.
కేవలం 11 ఏండ్లకే నందా హీరోయిన్ గా మారింది.తొలి సినిమాలోనే 30 ఏండ్ల యువతి పాత్రాల్లో ఆమె అద్భుతంగా నటించి అందరి చేత ప్రశంసలు పొందింది.
ఆ పాత్రతోనే తన కెరీర్ కు మంచి పునాది రాళ్లు వేసుకుంది.
ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగించింది నందా.
తన 14వ ఏట ఏవీఎం ప్రొడక్షన్స్ బాబీ సినిమాలో బాల వితంతుగా నటించింది.ఆ సినిమా మంచి విజయం సాధించింది.ఈ సినిమా స్వర్ణోత్సవం కూడా జరుపుకుంది.ఈ సినిమా ద్వారా నందా వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు.
మంచి సినిమాలు చేస్తూ దశాబ్దాల పాటు సినిమా రంగాన్ని ఏలింది.
తన తొలి సంపాదనతో పలు వస్తువులు కొనుకున్న నందా.
వాటిని తన చివరి శ్వాస వరకూ అపురూపంగా చూసుకుంది.చోటీ బహెన్ సినిమా ద్వారా వచ్చిన డబ్బుతో తను కారు, బంగళా కొనుగోలు చేసింది.
అయితే ఆ బంగళాకు అయిన ధర చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.అద్భుత బంగళా కోసం తను ఖర్చు చేసిన మొత్తం 150 రూపాయలు మాత్రమే.అయితే ఆ ఇల్లు ఆమె కొనుగోలు చేసిన సమయం 1950.అయినప్పటికీ అప్పట్లో తక్కువ ధరే అంటున్నారు సినీ జనాలు.అయితే అంత పెద్ద ఇల్లు.అంత తక్కువ ధరకు ఎందుకు అమ్మారు? అనే ప్రశ్న అప్పట్లో తలెత్తింది.అయితే ఆ బంగ్లాను అప్పట్లో చాలా మంది భూత్ బంగ్లా అనేవారట.అందుకే దాన్ని వదిలించుకోవాలనుకున్నారట యజమానులు.ఎంత వచ్చినా చాలు అనుకున్నారట.అందుకే చౌక ధరకు నందా ఆ భవనాన్ని దక్కించుకుందట.అయితే తను చనిపోయేంత వరకు ఆమె అదే నివాసంలో ఉన్నది.2014లో తను చనిపోయింది.