గుమ్మడి గింజలు( Pumpkin Seeds ). వీటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.
గుమ్మడి గింజల్లో ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్ తో సహా అనేక పోషకాలు నిండి ఉంటాయి.అందుకే రోజుకు రెండు స్పూన్లు గుమ్మడి గింజలు తింటే ఆరోగ్యపరంగా అపారమైన ప్రయోజనాలు పొందచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు సంరక్షణకు సైతం గుమ్మడి గింజలు ఉపయోగపడతాయి.గుమ్మడి గింజల్లో ఉండే ప్రోటీన్, జింక్, విటమిన్ ఈ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్( Omega 3 Fatty Acids ) వంటివి మన జుట్టు ఆరోగ్యానికి అండగా ఉంటాయి.

ముఖ్యంగా గుమ్మడి గింజలను ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే మీరు ఊహించని లాభాలు మీ సొంతం అవుతాయి.అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు గుమ్మడి గింజలు వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న గుమ్మడి గింజలు వేసి కొద్దిగా వాటర్ పోసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న గుమ్మడి గింజల పేస్ట్ వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive Oil ) మరియు వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ హెయిర్ మాస్క్( Hair Mask ) వేసుకుంటే జుట్టు కుదుళ్ళు సూపర్ స్ట్రాంగ్ గా మారతాయి.హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.తలపై అధిక ఆయిల్ ఉత్పత్తి తగ్గుతుంది.
స్కాల్ప్ శుభ్రంగా ఆరోగ్యంగా మారుతుంది.జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.
మరియు కురులు స్మూత్ గా సిల్కీగా సైతం మెరుస్తాయి.కాబట్టి ఆరోగ్యమైన ఒత్తైన సిల్కీ జుట్టును కోరుకునే వారు గుమ్మడి గింజలతో తప్పకుండా ఈ హెయిర్ మాస్క్ ను ప్రయత్నించండి.







