గర్భిణీలు సపోటా తింటే ఏం అవుతుందో తెలుసా?

స‌పోటా పండు.దీని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

 Sapota Is Very Useful To Pregnants! Sapota, Pregnants, Latest News, Health Tips,-TeluguStop.com

ఈ పండు చూసేందుకు అంత ఆక‌ర్ష‌ణీయంగా లేక‌పోయినా.రుచిలో మాత్రం అద్భుతంగా ఉంటుంద‌ని చెప్పాలి.

అందుకే పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు స‌పోటా పండును ఎంతో ఇష్టంగా తింటుంటారు.రుచిలోనే కాదు.

బోలెడ‌న్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు చేకూర్చ‌డంలోనూ స‌పోటా పండు ముందుంటుంది.ముఖ్యంగా గ‌ర్భిణీల ఆరోగ్యానికి స‌పోటా పండు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.
ప్రెగ్నెంట్‌గా ఉన్న ఆడ‌వారు స‌పోటా పండు తిన‌డం వ‌ల్ల నీర‌సం త‌గ్గుతుంది.త‌క్ష‌ణ శ‌క్తి ల‌భిస్తుంది.పిండిపదార్ధాలు, పోషకాలు పుష్క‌లంగా ఉండే సపోటా.పొట్టలో పసికందుకు కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేసి ఎదుగుద‌ల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది.

అలాగే పాలు ఇచ్చే తల్లులకు కూడా స‌పోటా పండు చాలా మంచి చేస్తుంది.ఇక‌ స‌పోటా పండు గ‌ర్భిణీల‌కు మాత్ర‌మే కాదు.

సామాన్యుల‌కు కూడా అనేక ప్ర‌యోజ‌నాల‌ను చేకూర్చుతుంది.

స‌పోటా పండులో విటమిన్ బి, సి పుష్క‌లంగా ఉంటాయి.

ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపొందిస్తుంది.కంటి చూపును మెరుగుపర్చ‌డంలో ఉప‌యోగ‌ప‌డే విట‌మిన్ ఏ కూడా స‌పోటా పండులో ల‌భిస్తుంది.

అలాగే నిద్రలేమి, అందోళన, ఒత్తిడి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు రోజుకు రెండు స‌పోటా పండ్లు తింటే.మంచి‌దంటున్నారు ఆరోగ్య నిపుణులు.
బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఖ‌చ్చితంగా స‌పోటా పండును డైట్‌లో చేర్చుకోవాలి.ఎందుకంటే, శ‌రీరానికి స‌రిప‌డా నీరు అందించడంలోనూ.మెటబాలిజం రేటును పెంచ‌డంలోనూ స‌పోటా స‌హాయ‌ప‌డుతుంది.అలాగే ఫాస్పరస్, ఐరన్, కాల్షియం వంటి పోష‌కాలు స‌పోటా పండులో ఉంటాయి.

ఇవి ఎముకులు, దంతాల‌ను దృఢంగా మారుస్తాయి.మ‌రియు స‌పోటా పండులో ఉండే పొటాషియం ర‌క్త పోటును కంట్రోల్ చేస్తుంది.

ఇక ప్ర‌తి రోజు రెండు స‌పోటా పండ్లు తింటే చ‌ర్మం య‌వ్వ‌నంగా మార‌డంతో పాటు జుట్టు కూడా ఒత్తుగా పెర‌గుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube