గర్భిణీలు ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండడమే మంచిది..!

గర్భంతో ఉన్న ఆడవారు అనేక రకాలైన ఆహార పదార్థాలను( Food items ) తింటూ ఉంటారు.ఎందుకు అంటే గర్భంతో ఉన్న ఆడవారికి ఎక్కువగా ఆకలి వేస్తూ ఉంటుంది.

 It Is Better For Pregnant Women To Stay Away From These Foods , Pregnant Women,-TeluguStop.com

కొందరిలో మాత్రం ఏమి తిన్నా వికారంగా అనిపిస్తూ వాంతులు చేసుకుంటూ ఉంటారు.గర్భిణీల( pregnant ) నోటికి ఇష్టం అనిపించింది తినాలని పెద్దలు చెబుతూ ఉంటారు.

కానీ గర్భిణీలు కొన్ని రకాల తినుబండారాలను తినడం అంత మంచిది కాదు.వాటిని తినడం వల్ల పుట్టబోయే బిడ్డపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది.

అలాగే ఆలూ చిప్స్ ( Potato chips )ను తయారు చేసే సమయంలో అత్యంత వేడైన నూనెలో వేడి ఫ్రై చేస్తారు.ఆ తర్వాత టెస్టింగ్ సోడాను వాటిపై చల్లుతారు.అలా చల్లే టెస్టింగ్ సోడా కూడా రసాయనంలో తయారవుతుంది.కాబట్టి ఈ పదార్థాలు గర్భిణి మహిళలకు అంత మంచిది కాదు.ఇంకా చెప్పాలంటే అత్యధికంగా నూనె వస్తువులు తినడం వల్ల పుట్టబోయే బిడ్డ సన్నగా పుట్టడం మాత్రమే కాకుండా పుట్టిన తర్వాత కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటాడని వైద్య నిపుణులు చెబుతున్నారు.అలాంటప్పుడు చిన్న పాపాయిని కడుపులో మోస్తున్న తల్లి ఎలా జంక్ ఫుడ్ తింటుంది అని వైద్యులు చెబుతున్నారు.

జంక్ ఫుడ్ గర్భంతో ఉన్న సమయంలో తినడం వల్ల అది పిల్లాడు పుట్టిన తర్వాత కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది.అందుకే ఆయిల్ ఫుడ్ ను తక్కువ తినడం లేదా వీలైతే మానేయడమే మంచిది.అంతేకాకుండా చిప్స్ మరియు ఆయిల్ స్నాక్స్( Oil snacks ) ను పూర్తిగా మానేయాలి.గర్భంతో ఉన్నవారు వాటిని అధికంగా తినకూడదని వైద్యులు చెబుతున్నారు.గర్భిణీలు ఆహారం ఒకేసారి తినకూడదు.మూడుసార్లు తినే ఆహారం ఐదు లేదా ఆరుసార్లు తినడం కూడా మంచిదే.

అలా తింటూ ఉన్న ఆహారం వెంటనే జీర్ణం అవుతూ ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube