తాటి బెల్లం( Palm Jaggery ) గురించి పరిచయాలు అక్కర్లేదు.సాధారణ బెల్లం చెరకు రసం నుండి తయారవుతుంది.
తాటి బెల్లం తాటి చెట్టు నీరుతో తయారవుతుంది.తాటి బెల్లం పూర్తిగా సహజమైనది, ఎలాంటి కెమికల్స్ ఉండవు.
తాటి బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి.పైగా శరీరాన్ని చల్లబరచే గుణాలను కూడా కలిగి ఉంటుంది.
అయితే తాటి బెల్లాన్ని నేరుగానే కాకుండా వివిధ ఆహార పదార్థాలతో కలిపి తినడం ద్వారా రుచిని పెంచుకోవడంతో పాటు అదిరిపోయే ఆరోగ్య లాభాలను పొందవచ్చు.
ఈ జాబితాలో పాలు( Milk ) మరియు తాటి బెల్లం బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు.
ప్రస్తుత రోజుల్లో ఎంతో మంది నిద్రలేమితో( Insomnia ) బాధపడుతున్నారు.అలాంటి వారు రోజూ నైట్ గోరు వెచ్చని పాలలో తాటి బెల్లం కలిపి తాగితే మంచిగా నిద్ర పడుతుంది.
నిద్ర నాణ్యత పెరుగుతుంది.

కొబ్బరి( Coconut ) మరియు తాటి బెల్లం కాంబినేషన్ కూడా మంచి ఆహార ఎంపిక అవుతుంది.తాజా కొబ్బరి తురుముతో తాటి బెల్లం కలిపి తింటే టేస్ట్ అదిరిపోవడమే కాదు శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.నీరసం, అలసట దూరం అవుతాయి.
తాటి బెల్లంతో గోధుమ రొట్టిను కూడా తినొచ్చు.గోధుమ రొట్టిలో తాటి బెల్లం కరిగించి, నెయ్యితో కలిపి తింటే చాలా రుచికరంగా ఉంటుంది.ఇదొక ఇది హెల్తీ డెజర్ట్‌లా ఉంటుంది.గోధుమ రొట్టి తాటి బెల్లం తింటే అతి ఆకలి తగ్గుతుంది.
షుగర్ క్రేవింగ్స్ అదుపులో ఉంటాయి.

బాదం, పిస్తా, జీడిపప్పు, అంజీర్, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్‌ను తాటి బెల్లంతో కలిపి తింటే పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.ఈ కాంబినేషన్ గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు బలాన్ని అందిస్తుంది.రక్తహీనత నివారణకు తోడ్పడుతుంది.
చర్మం ఆరోగ్యంగా మెరిసిపోవడానికి సహాయపడుతుంది.ఎముకలను బలోపేతం చేయడానికి మద్దతు ఇస్తుంది.
ఇక నిత్యం తాటి బెల్లంను నేరుగా తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.తాటి బెల్లం వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరుస్తుంది.తాటి బెల్లం రక్తాన్ని శుభ్రపరిచి శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది.తాటి బెల్లం ఇమ్యూటీ బూస్టర్ గా పని చేస్తుంది.
వైరల్, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.







