ఇటీవల రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మంది చాలా కామన్‌గా నిద్రలేమి సమస్యతో సతమతం అవుతున్నారు.ఆరోగ్యంగా జీవించాలంటే నిద్ర ఎంతో అవసరం.
రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోతే వివిధ రకాల జబ్బులు దరి చేరకుండా ఉంటాయి.కానీ, నిద్రలేమి సమస్య ఉన్న వారు రోజుకు నాలుగైదు గంటలు కూడా పడుకోలేకపోతుంటారు.
దాంతో అలసట, నీరసం, చికాకు, ఒత్తిడి, డిప్రెషన్, మెదడు పని తీరు నెమ్మదించడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, బరువు పెరగడం, ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్ అవ్వడం, చర్మ ఆరోగ్యం దెబ్బ తినడం వంటి ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.
గుండె పోటు, మధుమేహం వంటి సమస్యలు వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది.
అందుకే నిద్రలేమిని వీలైనంత త్వరగా నివారించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.అయితే అందుకు అశ్వగంధ ఓ దివ్య ఔషధంలా పని చేస్తుంది.
ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఓ పురాతన మూలిక ఇది.అశ్వగంధలో ఎన్నో అమోఘమైన పోషకాలు, ఔషధ గుణాలు నిండి ఉంటాయి.

అవి మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.ముఖ్యంగా నిద్రలేమి సమస్యను వదిలించడంలో అశ్వగంధ అద్భుతంగా సహాయపడుతుంది.అందుకోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో పావు స్పూన్ అశ్వగంధ పొడిని వేసి పది నిమిషాల పాటు మరిగించి.
వాటర్‌ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్‌లో వన్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకుని సేవించాలి.
ఇలా రోజుకు ఒకసారి చేస్తే నిద్రలేమి సమస్య దూరం అవుతుంది.కంటి నిండా నిద్ర పడుతుంది.
తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది.ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలన్నీ పరార్ అవుతాయి.
మెదడు పని తీరు సైతం చురుగ్గా మారుతుంది.