రాహుల్ ద్రవిడ్…( Rahul Dravid ) ఇది భారతీయులకు పరిచయం అవసరంలేని పేరు.ఇంకా చెప్పాలంటే ….
ప్రపంచ క్రికెట్ ప్రేమికులకు పరిచయం అవసరంలేని పేరు.ఇండియన్ క్రికెటింగ్ లెజెండ్స్ లో ఒకరు రాహుల్ ద్రవిడ్.
1973 లో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో( Indore ) జన్మించిన ద్రవిడ్ , 1996 అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు.సుమారు 18 ఏళ్ళ తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్ లో ద్రవిడ్ 164 టెస్ట్ మ్యాచ్లు, 344 వన్ డేలు, ఒక టీ 20 మ్యాచ్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు.
అనేక రికార్డులు కూడా నెల్కొలిపాడు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్( ICC ) విడుదల చేసిన ప్రపంచంలో 10 అత్యుత్తమ క్రికెటర్ల జాబితాలో స్థానం సంపాదించాడు.
టెస్ట్ క్రికెట్ లో భారతీయ ఆటగాళ్లలో అత్యధిక సగటు ఇతనిది.అందుకే ద్రవిడ్ ను అందరు ముద్దుగా “ది వాల్”( The Wall ) అని పిలుస్తారు.
ద్రవిడ్ ప్రస్తుతం భారత క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా ఉన్నాడు.ఐతే ఎన్ని ఘనతలు సాధించినప్పటికీ, రాహుల్ ఎప్పుడు వినయంగానే మాట్లాడతాడు.అందరితో కలిసి మెలిసి ఉంటాడు.తాజాగా రాహుల్ ద్రవిడ్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.
ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
అదేంటో ఇప్పుడు చూద్దాం.కొన్నేళ్ల క్రితం ద్రవిడ్ ను గౌరవ డాక్టరేట్ తో( Honorary Doctorate ) సత్కరించాలని నిర్ణయించుకుంది ఒక బెంగళూరు యూనివర్సిటీ.( Bangalore University ) ఈ విషయమై అతన్ని సంప్రదించారు యూనివర్సిటీ యాజమాన్యం.
కానీ ఈ గౌరవాన్ని సున్నితంగా తిరస్కరించాడట ద్రవిడ్.దీనికి ఒక మంచి కారణం కూడా చెప్పాడట.
రాహుల్ ద్రవిడ్ భార్య ఒక డాక్టర్.ఆమె ఆ డిగ్రీ పొందడానికి ఎంతో కష్టపడిందని, రాత్రి పగలు, నిద్రాహారాలు మానేసి ఎన్నోయేళ్లు శ్రమిస్తే తనకు ఆ గౌర్నవం దక్కిందని, అలాగే తన తల్లి ఒక ఆర్ట్స్ ప్రొఫెస్సర్, కూడా ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఆ పట్టాను సంపాదించిందని తెలిపాడు.
తాను క్రికెట్ కోసం ఎంతో కష్టపడ్డానని, అందులో ఏ గౌరవం లభించిన స్వీకరిస్తానని, కానీ చదువులో తానెన్నడూ శ్రమించలేదని, అందుకే ఆ డాక్టరేటు స్వీకరించలేనని చెప్పాడట.అంతే కాకుండా ఏదో ఒకరోజు క్రికెట్ పై ఒక వ్యాసం రసో, లేక స్పోర్ట్స్ విభాగంలో ఏదయినా అకాడమిక్ రీసెర్చ్ చేసో డాక్టరేట్ సంపాదిస్తానని చెప్పాడట ద్రవిడ్.ఈ సమాధానం విన్న ఆ యూనివర్సిటీ యాజమాన్యం అతని నిరాడంబరత, వినయం చూసి ఆశ్చర్యపోయారట.