మచ్చలేని చర్మాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి.స్త్రీలు అయినా పురుషులు అయినా తమ ముఖ చర్మం ఎలాంటి మచ్చా లేకుండా అందంగా మరియు కాంతివంతంగా మెరిసిపోవాలని ఆరాటపడుతుంటారు.
అందుకోసం ఖరీదైన క్రీమ్, సీరం, మాయిశ్చరైజర్ తదితర ఉత్పత్తులన్నీ వాడుతుంటారు.అయితే మార్కెట్లో లభ్యమయ్యే ఉత్పత్తులను ఎన్ని వాడినా సరే చర్మంపై మచ్చలు పడుతూనే ఉంటాయి.
కానీ ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ మ్యాజికల్ క్రీమ్ ను కనుక వాడితే మచ్చలు లేని చర్మం మీ సొంతం అవ్వడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమ్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేయండి.
ముందుగా ఒక ఆరెంజ్ ను తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి పై తొక్కను సపరేట్ చేసుకోవాలి.అలాగే ఐదు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి పెట్టుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఆరెంజ్ పండు తొక్కలు, పొట్టు తొలగించిన వెల్లుల్లి రెబ్బలు, రెండు బిర్యాని ఆకులు, అంగుళం పొట్టు తొలగించిన అల్లం ముక్క వేసుకుని కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి పల్చటి వస్త్రం సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ లో తీసుకుని అందులో ఈ జ్యూస్ ను వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు షియా బటర్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉంచి మెల్ట్ చేసుకోవాలి.

ఇలా మెల్ట్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ వేసి బాగా మిక్స్ చేస్తే మన క్రీమ్ సిద్ధమవుతుంది.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ క్రీమ్ ను వాడితే ఎటువంటి మొండి మచ్చలైన క్రమంగా మాయం అవుతాయి.
మచ్చలేని చర్మం మీ సొంతమవుతుంది.మరియు చర్మం మృదువుగా కోమలంగా కూడా మారుతుంది.