మెగాస్టార్ వారసుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి కొద్దీ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు రామ్ చరణ్ తేజ్. మొదట్లో చాలానే విమర్శలు ఎదుర్కొన్నా అవన్నీ లెక్కచేయకుండా తన డెడికేషన్ తో వాటిని కూడా చెరిపేసి స్టార్ హీరోగా ఈ రోజు ప్రేక్షకుల ముందు నిలబడ్డాడు.
అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్ నటించి ప్రశంసలు అందుకున్నాడు.
ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి పాన్ ఇండియా స్టార్ గా నిరూపించు కున్నాడు.
ఇక ఇప్పుడు రామ్ చరణ్ మరో అగ్ర డైరెక్టర్ శంకర్ తో సినిమా స్టార్ట్ చేసాడు. ‘RC15’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమా ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ అంచనాలు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి.
అయితే ఫ్యాన్స్ ఒక విషయంలో ఆందోళన పడుతున్నారు.
ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండడంతో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ప్రేక్షకుల అంచనాలను అందుకోగలడా లేదా అని చరణ్ ఫ్యాన్స్ డౌట్ పడుతున్నారు.అందులోను శంకర్ సినిమా అంటే అన్ని విషయాల్లో గ్రాండ్ గా ఉంటుంది.
ఇక మ్యూజిక్ కూడా గ్రాండ్ గా అందిస్తాడో లేదో అని అంతా కంగారు వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సినీ వర్గాల నుండి అందుతున్న టాక్ ప్రకారం ఈ సినిమా ఆల్బమ్ గురించి కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి కానీ ఎవరు కూడా ఎలాంటి డౌట్ పెట్టుకోవద్దు అంటున్నారు.ఈ సినిమా అవుట్ పుట్ చాలా బాగా వస్తుందని ఎవరు కూడా అలాంటి డౌట్ లు ఏమీ పెట్టుకోవద్దు అంటూ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.ఇదే నిజం అయితే ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.దిల్ రాజు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
ఈ సినిమాలో కీలక పాత్రల్లో సునీల్, అంజలి వంటి వారు నటిస్తున్నారు.







