ఎంత లావుగా ఉన్న వారైనా పెసలను ఇలా తీసుకుంటే నెల రోజుల్లో నాజూగ్గా మారిపోతారు!

ఇటీవల రోజుల్లో ఎంతో మంది ఓవర్ వెయిట్ సమస్య( Overweight Problem )తో బాధపడుతున్నారు.రోజు అద్దంలో తమను తాము చూసుకున్న ప్రతిసారి తీవ్ర వేదనకు గురవుతుంటారు.

 How To Lose Weight With Moong Dal!, Moong Dal, Moong Dal Benefits, Weight Loss,-TeluguStop.com

అధిక బరువు కారణంగా ఇష్టమైన దుస్తులు వేసుకోలేకపోతుంటారు.అలాగే శరీర బరువు అదుపు తప్పితే ఎన్నో అనారోగ్య సమస్యలను ఆహ్వానించినట్లు అవుతుంది.

అందుకే బరువు తగ్గడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.అయితే వెయిట్ లాస్ కు కొన్ని కొన్ని ఆహారాలు గ్రేట్ గా సహాయపడతాయి.

వాటిలో పెసలు( Mung bean ) ఒకటి.ఎంత లావుగా ఉన్న వారైనా సరే పెసలను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే నెల రోజుల్లో నాజూగ్గా మారతారు.

Telugu Tips, Latest, Moong Dal, Smoothie-Telugu Health

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు పెసలు వేసి వాటర్ తో ఒకటికి రెండుసార్లు వాష్ చేసుకోవాలి.ఆపై ఒక గ్లాస్ వాటర్ పోసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో నానబెట్టుకున్న పెసలు వాటర్ తో సహా వేసి.పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.ఆపై బ్లెండర్ తీసుకుని అందులో ఉడికించి చల్లార పెట్టుకున్న పెసలు వేసుకోవాలి.

అలాగే ఒక అరటిపండు, రెండు టేబుల్ స్పూన్లు పీనట్ బటర్( Peanut Butter ), నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు, ఒక గ్లాస్ హోమ్ మేడ్ బాదం పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

తద్వారా మంచి స్మూతీ సిద్ధం అవుతుంది.ఈ స్మూతీలో నానబెట్టుకున్న చియా సీడ్స్( Chia Seeds ) కలిపి తీసుకోవాలి.ఈ స్మూతీలో ప్రోటీన్, ఐరన్, కాలుష్యం, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు మెండుగా ఉంటాయి.శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ సైతం నిండి ఉంటాయి.

Telugu Tips, Latest, Moong Dal, Smoothie-Telugu Health

ఈ స్మూతీని రెగ్యులర్ డైట్( Regular Diet ) లో కనుక చేర్చుకుంటే ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది.చిరు తిండ్లపై మనసు మళ్లకుండా ఉంటుంది.అతి ఆకలి దూరమవుతుంది.మెటబాలిజం రేటు రెట్టింపు అవుతుంది.దాంతో క్యాలరీలు కరిగే వేగం పెరుగుతుంది.ఫలితంగా వెయిట్ లాస్( Weight Loss ) అవుతారు.

అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారికి ఇది బెస్ట్ స్మూతీగా చెప్పుకోవచ్చు.పైగా ఈ స్మూతీ తో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

కాబట్టి తప్పకుండా దీనిని డైట్ లో చేర్చుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube