శుభకార్యాలలో, పండుగలలో ఇంటికి మామిడి ఆకులు ఎందుకు కడతారో తెలుసా..??

మన హిందూ సాంప్రదాయంలో హిందువులు ఇంట్లో ఏ శుభకార్యం చేసిన ఏ పండుగలు చేసిన ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు కడతారు.అయితే అప్పుడే ఆ ఇంటికి కల వస్తుంది.

 Do You Know Why Mango Leaves Are Washed At Home During Festivals  ,  Festivals ,-TeluguStop.com

కానీ మామిడి ఆకులనే ఎందుకు కడతారు అన్న విషయం చాలా మందికి తెలిసి ఉండదు.పచ్చగా ఉండాలని అనుకుంటే ఏ ఆకునైనా కట్టుకోవచ్చు కదా అనే సందేహాలు ఏర్పడతాయి.

అయితే శుభకార్యాల్లో మామిడి ఆకుల( Mango leaves )కు ఎంతో ప్రధాన్యత ఉంది.పెళ్లిలో( Wedding ) ఇదే మామిడి ఆకులను కూడా దోర్నాపాకు అంటారు.

Telugu Bhakti, Devotional, Festivals, Kalasham, Lakshmi Devi, Mango, Saffron, Tu

అయితే ఈ సాంప్రదాయం వెనుక కారణాలు ఉన్నాయి.మామిడి, రావి, జువ్వి, మర్రి, ఉత్తరేణి ఆకులను పంచపల్లవాలని పిలుస్తారు.అయితే వీటిని శుభకార్యాలలోనే ఉపయోగిస్తారు.వీటిని తోరణాలుగా మాత్రం మామిడాకులనే వినియోగిస్తారు.పండుగలు, వేడుకలు, వివాహాది సమయాల్లో గుమ్మానికి ఈ మామిడి ఆకులను కడితే శుభ సూచకమని భావిస్తారు.యజ్ఞ యాగాదుల్లో మామిడి ఆకులతో కూడిన ధ్వజారోహణం చేయడం అనాధిక వస్తున్న ఒక సాంప్రదాయం ఇక పూజ కలశం లోను కూడా మామిడాకులనే ఉపయోగిస్తారు.

Telugu Bhakti, Devotional, Festivals, Kalasham, Lakshmi Devi, Mango, Saffron, Tu

అయితే ప్రతి ఇంట్లో శుభకార్యాలు, పండుగ సమయంలో గడపలకు పసుపు, కుంకుమ( Turmeric ) రాసి బొట్టు పెడతారు.అలాగే గుమ్మాలపై పచ్చటి మామిడాకుల తోరణాలు కూడా కడతారు.ఇలా చేయడం వలన ఇంట్లోకి ధనలక్ష్మితో ( Lakshmi Devi )పాటు సకల దేవతల పరివారం వస్తారని పండితులు చెబుతున్నారు.అంతేకాకుండా ఫలితంగా ఆ ఇంట్లోకి ధనం వచ్చి చేరుతుంది.

ఆ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయని అందరూ విశ్వసిస్తారు.ఎందుకంటే ఇంటి అలంకరణ ఎంత బాగుంటే అంతలా దేవుళ్ళు ఇంట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయట.

Telugu Bhakti, Devotional, Festivals, Kalasham, Lakshmi Devi, Mango, Saffron, Tu

మామిడి ప్రేమ, సంపద, సంతాన్ని అభివృద్ధికి సంకేతమని రామాయణ భారతాల్లో కూడా ప్రస్తావించారు.అలాగే మన పురాణాల్లో కూడా మామిడాకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.అయితే మామిడి చెట్టు కోరికలను తీరుస్తుంది అని భక్తి ప్రేమకు సంకేతం అని భారతీయ పురాణాల్లో పేర్కొనడం జరిగింది.అందుకే మామిడి ఆకులను అందరూ శుభ సూచికంగా భావిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube