శ్రీశైలం డ్యాం వెనుక జలాల నుంచి పూర్తిగా బయటపడ్డ కోవెల ఆరు నెలల తర్వాత తొలి పూజ అందుకున్న స్వామి సంగమేశ్వరుడు.నందికొట్కూరు తాలూకా కొత్తపల్లి మండలం పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయంలో భక్తులు బురదను శుభ్రం చేశారు.
ధర్మరాజు ప్రతిష్టించిన వేపదారు లింగం బుధవారం భక్తులకు దర్శనమిచ్చింది సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే సంగమేశ్వరుడు దర్శన భాగ్యం లభిస్తుందడంతో ఈ దేవాలయ సందర్శనకు భక్తులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.బుధవారం భీష్మ ఏకాదశి సందర్భంగా లలితా దేవి సమేత సంగమేశ్వర స్వామి, వినాయకుడు తదితర దేవత మూర్తులు తొలి పూజ అందుకున్నారు.
సప్త నది సంఘమ ప్రాంతంలోని సంగమేశ్వర దేవాలయం శ్రీశైల జలాశయం నుంచి పూర్తిగా బయటకు కనిపించింది.జులై మూడో వారంలో వరద రావడంతో దేవాలయం పూర్తిగా కృష్ణమ్మ ఒడిలోకి చేరింది సుమారు ఆరు నెలల తర్వాత పూర్తిగా భక్తులకు ఈ దేవాలయం దర్శనమిస్తూ ఉంది.
నీరు తగ్గు మొహం పట్టడంతో బుధవారం పురోహితులు తిలక పల్లి రఘురామ శర్మ ఆధ్వర్యంలో భక్తులు దేవాలయాన్ని శుభ్రం చేశారు.పూజలు మళ్ళీ మొదలుపెట్టారు.

వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఉన్న ఈ దేవాలయం శిథిలం కావడంతో ప్రస్తుతం కనిపిస్తున్న గుడిని సుమారు 200 సంవత్సరాల క్రితం స్థానిక ప్రజలు నిర్మించారు.పూర్వం రెండువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గుడితో పాటు చుట్టు ప్రకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే తెలుస్తుంది.ముఖ మండపం పూర్తిగా శిథిలమైపోగా అంతరాలయం గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి.ధర్మాలయంలో సంగమేశ్వరుడు పూజలు అందుకుంటున్నారు.శివుడు వెనుక వైపున ఎడమ భాగంలో లలితాదేవి, కుడివైపున వినాయకుడి దర్శనం ఇస్తారు.శ్రీశైలం జలాశయం నిండితే ఈ దేవాలయం పూర్తిగా జలదివాసంలోకి వెళ్ళిపోతుంది.
అందుకే ఇక్కడ నిత్యం పూజలు జరగవు.సంవత్సరంలో నాలుగు నెలలు మాత్రమే స్వామి వారు పూజలు అందుకుంటారు.
ఈ సంవత్సరం శ్రీశైలం నీటిమట్టం త్వరగా తగ్గడంతో సంగమేశ్వరుడి దర్శన భాగ్యం త్వరగా లభించిందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ సంవత్సరం ఆరు నెలల పాటు దేవాలయాన్ని సందర్శించే అవకాశం ఉంది అని చెబుతున్నారు.