మునీశ్వర శబ్దం ప్రజల నాలుకలతో మునేశ్వరుడుగా మారింది.ఇక దేవాలయ విషయాలలో వైరి సమాసాలు సామాన్యం.
గర్భ గుడి వంటివి.అలా ఏర్పడిందే మునేశ్వర గుడి.
ఈ సంప్రదాయం తమిళనాట ఎక్కువగా ఉంది.ఆంధ్ర దేశంలో కన్పించదు.
ఋగ్వేద కాలం నుండి గ్రామ దేవతా పూజలు ప్రకృతి ఆరాధనలు ప్రచురంగా ఉన్నాయి.ఋగ్వేద కాలంలో అమ్మ తల్లిని ఎక్కువగా ఆరా ధించినట్లు నిదర్శనాలు ఉన్నాయి.
ప్రతి గ్రామ రక్షణకు… ఒక అధిష్టాన దేవత ఏర్పాట య్యింది. శ్రీ కృష్ణునికి మారుగా యోగ మాయ, కంసునకు చిక్కి వానిచే వధింపబడక వానికి బుద్ధి చెప్పి అదృశ్యురాలైంది.
అపుడు మహా విష్ణువు ఆమెకు ప్రతి గ్రామంలో తొలి పూజలు అందుకొనే వరం ఇచ్చాడు.ఆ దేవతల దేవాలయాలు గ్రామాలకు బయట ఉండేవి.
కొలువులు సమయంలో ఆ దేవతలను, గొట్టెలు, దున్నలు, పొట్టేళ్లు, మేకలు, కోళ్లు, మొదలైన వాటిని బలి సమర్పించేవారు.
కాళి, మారెమ్మ, నాంచారమ్మ, తాటెమ్మ, నూకాలమ్మ, గంగానమ్మ ఈదులమ్మవంటి పేర్లతో ఈ క్షుద్రదేవతలు పూజలందుకొంటున్నారు.వీరికి సాత్వికపూజలు కూడ చెల్లిస్తారు.
ఈ స్త్రీ.దేవతాపూజలు సాగుతుండగా ఆర్య సంస్కృతి తొంగి చూచింది.
వారు పురుషదైవాలకు ప్రాధాన్యమిచ్చారు.వెంటనే క్షుద్రదేవత లందరికి ఒక తమ్ముడు పోతురాజు అనేదైవం తెరపైకివచ్చాడు.
ప్రతి గ్రామంలో పోతురాజు విగ్రహాలు ప్రత్యక్షమైనాయి.ఆర్యులు యుద్ధానికి వెళ్లేముందు పురుష దేవతలను పూజించేవారు.
ఎన్నోజంతువులను బలిచ్చేవారు.ఆ దేవతలే విజయ మిస్తారని నమ్మేవారు.
అందుకే మునేశ్వరుని గుడికడ గుఱ్ఱాలను అధిరోహించిన వీరుల విగ్రహాలు ఉంటాయి.వీర వైశం వ్యాప్తిలోనికి వచ్చిన తర్వాత గ్రామ రక్షకులుగా వీర భద్రుడు, కాల భైరవుడు, మొదలైనవారి విగ్రహాలను గ్రామాలకు ముందు ప్రతిష్ఠించి వారికి పూజలు నిర్వహించేవారు.
కాశీకి కూడా కాలభైరవుడు రక్షకునిగా కీర్తింపబడుతున్నాడు.వైష్ణవం వచ్చిన తర్వాత హనుమంతుడు గ్రామ రక్షకునిగా నియమింపబడినాడు.
ఈ విధంగాచూస్తే ఆ పాతకాలానికి పూజలు, మునేశ్వర గుడిపూజలు అని వస్తుంది.ఇవి ఆచార వ్యవహారాలకు సంబంధించిన విషయాలేగాని వీనికొక ప్రత్యేక చరిత్ర కన్పించదు.