మినుము, పెసర ( Minumu, pesara )లాంటి పంటలను ఖరీఫ్ తర్వాత వరి మాగాణుల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు.అయితే రైతులు మినుము పంటకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
వరి పంట కోయడానికి కేవలం రెండూ లేదా మూడు రోజుల ముందు మినుము విత్తనాలను పొలంలో వెదజల్లుతారు.నవంబర్ నుంచి డిసెంబర్ లోపు విత్తిన పైర్లలో, వాతావరణ పరిస్థితులు వల్ల పంట పెరుగుదల సరిగా లేదు.
డిసెంబర్ మొదటి వారం తర్వాత వ్యక్తిన పైర్లలో పెరుగుదల ఆశాజనకంగా ఉంది.నేలలో తేమ ఆరే కొద్దీ మినుము మొక్కలు వేగంగా పెరుగుతాయి.
మినుము పంటకు చీడపీడల బెడద( Pest infestation ) కంటే తెగుళ్ల బెడద చాలా ఎక్కువ.మినుము పంటకు తుప్పు తెగుళ్లు ఆశిస్తే ఊహించని నష్టం ఎదుర్కోవాల్సిందే.ఆకు ఉపరితలంపై లేత పసుపు రంగులో గుండ్రని మచ్చలు ఏర్పడి అవి క్రమంగా నల్లగా మారుతాయి.ఈ మచ్చలు ఆకు అంతా వ్యాపించడం వల్ల ఆకులు ఎండిపోయి రాలిపోతాయి.
ఈ తుప్పు తెగులను గుర్తించి తొలిదశలోనే అరికట్టాలి.ఈ తెగుల వ్యాప్తి తక్కువగా ఉంటే.
తెగులు సోకిన మొక్కలను పీకేసి కాల్చి నాశనం చేయాలి.ఆ తరువాత మూడు గ్రాముల మాంకోజెబ్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
లేదంటే ఒక లీటరు నీటిలో ఒక గ్రాము బైలాటాన్( Bailatan ) కలిపి పిచికారి చేయాలి.
మినుము పంటకు ఏవైనా తెగుళ్లు ఆశించిన తర్వాత వాటిని నివారించే చర్యలు చేపట్టడం కంటే తెగుళ్లు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.విత్తన శుద్ధి( Seed treatment ) చేసిన తెగులు నిరోధక విత్తనాలను పొలంలో విత్తాలి.పొలంలో మొక్కల మధ్య మొక్కల వరుసల మధ్య కాస్త అధిక దూరం ఉంటే మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి.
వివిధ రకాల తెగుళ్ళకు చీడపీడలకు అతిథులుగా ఉండే కలుపు మొక్కలను పొలంలో లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.వాతావరణంలో పరిస్థితులు మారినప్పుడు ఖచ్చితంగా మినుము పంటకు ఏవైనా తెగుళ్లు లేదా చీడపీడలు ఆశించే అవకాశం చాలా ఎక్కువ.
అలాంటి సమయాలలో పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటూ తొలి దశలోనే వాటిని నివారించి పంటను సంరక్షించుకోవాలి.