నిన్న జరిగిన కాంగ్రెస్ సీడబ్ల్యూసీ మీట్ వాడి వేడిగా జరిగింది.ఈ మీట్ లో రాహుల్ గాంధీ సోనియా గాంధీ హాస్పిటల్ లో ఉన్న సమయంలో నాయకత్వ మార్పు పై లేఖ రాసిన వారిపై ఓ రేంజిలో ఫైర్ అయ్యారు.
లేఖ రాసిన సదరు సభ్యులు బిజేపితో కుమ్మక్కయ్యారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.దీనిపై స్పందించిన ఆజాద్ అలాంటి ఆధారాలు చూపిస్తే తను పార్టీకి రాజీనామా చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీనిపై మొదట ఘాటుగా స్పందించిన కపిల్ సిబల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా రాహుల్ గాంధీ అలా అనలేదని ట్వీట్ చేశాక తన మాటలు వెనక్కి తీసుకున్నాడు.అయితే ఈ సీడబ్ల్యూసీ సమావేశం వర్చువల్ విధానంలో జరిగింది.
ప్రస్తుతానికి సోనియా గాంధీకి మరోమారు సీడబ్ల్యూసీ కాంగ్రెస్ అధ్యక్షత బాధ్యతలను అప్పగించారు.
ఇక ఈ మీట్ అయ్యాక కపిల్ సిబాల్, శశి థరూర్, మనీష్ తివారీ, ముకుల్ వాస్నిక్ వంటి సీనియర్స్ ఆజాద్ ఇంటికి హాజరయ్యారు.
దీంతో ఇది ఢిల్లీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.వర్చువల్ గా నిర్వహించిన సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం ఇలా సీనియర్స్ అంతా రాహుల్ వ్యాఖ్యలకు రాజీనామా చేస్తానని ప్రకటించిన ఆజాద్ ఇంట్లో భేటీ ఎందుకయ్యారో తెలియక తలలు బాదుకుంటున్నారు!
.