ప్రమాదం నుంచి బయటపడిన సోనుసూద్ భార్య... కాపాడింది ఇదే అంటూ పోస్ట్!

సినీ నటుడు సోను సూద్(Sonu Sood) భార్య పెద్ద ప్రమాదం నుంచి బయటపడిన విషయం తెలిసిందే.ఈమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి(Car Accident) గురి అయింది.

 Soonu Sood Sensational Post On Her Wife Car Accident ,soonu Sood,car Accident,wi-TeluguStop.com

ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ తన భార్యకు మాత్రం ఏమి కాలేదు ఇలా ఈమె పెద్ద ప్రమాదం నుంచి బయటపడిందని చెప్పాలి.ఇలా ఈ ప్రమాదంలో తన భార్య క్షేమంగా బయటపడటంతో సోనూసూద్ సోషల్ మీడియా వేదికగా తన భార్య కారు ప్రమాదం గురించి పోస్ట్ చేశారు.

ముంబై-నాగ్‌పూర్ హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తుంది.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో సోనుసూద్ భార్యతో పాటు ఆమె సోదరి, అల్లుడితో కలిసి ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ వెహికల్‌లో వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది.

ట్రక్కును గుద్దడంతో కారు మొత్తం నుజ్జు నుజ్జు అయ్యింది.  అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు జరగలేదు అయితే ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ తన భార్య ఇతరులు ప్రమాదానికి గురి కాకపోవడానికి కారణాన్ని తెలియజేస్తూ.

Telugu Car, Seat Belt, Soonu Sood, Soonusood-Telugu Top Posts

ఈరోజు ప్రమాదంలో నా భార్య అలాగే కుటుంబ సభ్యులు క్షేమంగా బయటపడ్డారు అంటే సీట్ బెల్ట్ (Seat Belt)కారణమని ఈయన సీట్ బెల్ట్ గురించి వివరించారు.సాధారణంగా కారులో ప్రయాణిస్తున్న సమయంలో వెనుక సీట్ల కూర్చున్న వారు సీట్ బెల్ట్ పెట్టుకోరు కానీ ఈ అలవాటును ప్రతి ఒక్కరు మార్చుకోవాలని తెలిపారు.కారులో ఎక్కడ కూర్చున్నా రెగ్యులర్‌గా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సోనూసూద్ చెప్పారు.ఇక రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా సేఫ్టీ రూల్స్ తప్పకుండా పాటించాలని తెలిపారు.

ఇది ప్రాణాలకు సంబంధించిన విషయం కావడంతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని అజాగ్రత్త ఏమాత్రం పనికిరాదని సోను సూద్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube