మనుషుల వయసు పెరిగేకొద్దీ ఎముకలు బలహీన పడుతూ ఉంటాయి.మనిషి శరీర భాగంలో ఎముకలు బలహీనంగా ఉంటే ఏ ఒక్క చిన్న పని చేసిన త్వరగా అలసిపోతూ ఉంటారు.
అందువల్ల ఎముకలు బలంగా ఉండడానికి ఈ ఆహారాలను అస్సలు తినకూడదు.ముఖ్యంగా ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తినడం వల్ల మన శరీరంలోని ఎముకలకు చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
ఉప్పు నువ్వు ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలోని కాల్షియం వ్యర్థంగా బయటికి వెళ్లి పోతుంది.దానితో మన శరీరంలో క్యాల్షియం లోపం ఏర్పడే అవకాశం ఉంది.
స్వీట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.
చక్కెరను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి.
ఐరన్ తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.ఐరన్ ఎక్కువగా తీసుకుంటే మన శరీరంలోని ఎముకలు ప్రమాదంలో ఉన్నట్టే.
ఎక్కువగా శీతల పానీయాలు వంటి కార్బోనేటేడ్ పానీయాలను తాగడం వల్ల ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది.ఎందుకంటే వీటిలో ఎక్కువ మొత్తంలో ఫాస్ఫారిక్ ఆమ్లం ఉంటుంది.
ఈ ఆమ్లం మన శరీరంలో ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు త్వరగా విరిగిపోయే అవకాశం కూడా ఉంది.కెఫిన్ అనే పదార్థం ఎక్కువగా ఉండే పానీయాలను తీసుకోవడం వల్ల కూడా ఎముకలు బలహీన బడతాయి.

మన శరీరంలో ఉండే కెఫిన్, శరీరంలోని క్యాల్షియంను ఎముకలు గ్రహించే సామర్థ్యాన్ని కోల్పోయేలా చేస్తుంది.30 సంవత్సరములు దాటిన తర్వాత కూడా ఎముకలు బలంగా ఉండాలంటే కచ్చితంగా ఈ ఆహారాలు ప్రతిరోజు మనం తినే వాటిలో ఉండాలి.అందుకే ఈ రోజుల్లో చాలా మంది ప్రోటీన్ ఫుడ్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు.వీటితోపాటు తాజా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు మన ఆహారంలో భాగం చేసుకుంటే మన శరీరానికి తగిన మోతాదులో క్యాల్షియం లభిస్తుంది.
వీటితోపాటు ప్రతిరోజు ఉదయం రన్నింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే మన శరీర ఎముకల ఆరోగ్యం బాగుంటుంది.