అధిక బరువు.ప్రస్తుత రోజుల్లో కోట్లాది మందిని కలవర పెడుతున్న సమస్య ఇది.పెరిగిన బరువును తగ్గించుకోవడం కోసం చాలా మంది నైట్ టైమ్ భోజనం మానేసి గోధుమ పిండితో తయారు చేసిన రోటీలను తింటుంటారు.కానీ, మార్కెట్లలో దొరుకుతున్న గోధుమ పిండిలో ఫైబర్ తక్కువగా, గ్లూటెన్ ఎక్కువగా ఉంటోంది.
అలాంటి గోధుమ పిండిని వాడటం వల్ల బరువు తగ్గరు సరికదా.ఇంకా పెరుగుతారు.
పైగా రోజూ గోధుమ పిండిని తీసుకుంటే కడుపు నొప్పితో పాటు వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
అందుకే గోధుమ పిండికి ప్రత్యామ్నాయంగా సజ్జ పిండిని ఎంచుకోవడం ఎంతో ఉత్తమమైన మార్గం.
తృణధాన్యాల్లో సజ్జలది ప్రత్యేక స్థానం.సజ్జలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.బరువును తగ్గించే సామర్థ్యం కూడా సజ్జలకు ఉంది.సజ్జ పిండిలో గ్లూటన్ ఉండదు.ప్రొటీన్, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.ఇవి మీ ఫిట్నెస్ కు ఎంతగానో సహాయపడతాయి.

అందువల్ల, సజ్జలతో ఇంట్లోనే పిండిని తయారు చేసుకుని.ఆ పిండితో రోటీలను చేసి నైట్ టైమ్ తినాలి.తద్వారా వేగంగా బరువు తగ్గుతారని స్వయంగా పోషకాహార నిపుణులే చెబుతున్నారు.అలాగే సజ్జ పిండి రోటీలను డైట్ లో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
శరీరానికి అవసరం అయ్యే ఐరన్ అందుతుంది.దాంతో రక్తహీనత సమస్య దరి దాపుల్లోకి రాకుండా ఉంటుంది.
అంతేకాదు, సజ్జ పిండితో రోటీలను తయారు చేసుకుని తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో పేరుకు పోయిన కొవ్వు కరుగుతుంది.గుండె ఆరోగ్యవంతంగా మారుతుంది.
రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగుపడుతుంది.
మరియు రక్తపోటు సైతం కంట్రోల్ లో ఉంటుంది.







