ఏదైనా ఫంక్షన్ లేదా పెళ్లి లేదా ముఖ్యమైన వారితో డేట్ కు వెళ్లాల్సి వచ్చినప్పుడు ముఖ చర్మం డల్ గా ఉంటే ఇక వారి బాధ వర్ణనాతీతం.అసలు బయటకు వెళ్ళాలి అన్న మూడు, ఉత్సాహం రెండు పోతాయి.
ఎంత మేకప్ వేసిన సరే ముఖంలో డల్ నెస్ అనేది పోనే పోదు.దీంతో ఏం చేయాలో తెలియక ఆగమాగం అయిపోతుంటారు.
అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే క్షణాల్లో డల్ నెస్ ఎగిరిపోతుంది.ముఖం కాంతివంతంగా మరియు ఆకర్షణీయంగా మారుతుంది.
మరి ఇంకెందుకు లేటు ఆ మ్యాజికల్ హోమ్ రెమెడీ ఏంటి అనేది తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు చియా సీడ్స్ వేసుకోవాలి.
అలాగే ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకొని పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.ఈలోపు ఒక చిన్న బీట్ రూట్ తీసుకుని తొక్క తొలగించి వాటర్ లో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ ముక్కలను మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మరోసారి మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న చియా సీడ్స్ ను పాలతో సహా వేసుకోవాలి.అలాగే బీట్ రూట్ జ్యూస్ ను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి.
ఇరవై నిమిషాల పాటు ఈ చియా సీడ్స్ బీట్ రూట్ మాస్క్ ను ఉంచుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఇలా చేస్తే ముఖంలో డల్ నెస్ క్షణాల్లో పోతుంది.ముఖ చర్మం బ్రైట్ గా, సూపర్ గ్లోయింగ్ మారుతుంది.అలాగే తరచూ ఈ హోమ్ మేడ్ మాస్క్ ను వేసుకోవడం వల్ల చర్మ ఛాయ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.అలాగే ముడతలు ఉంటే తగ్గుముఖం పట్టి చర్మం టైట్ గా మారుతుంది.
ఇక ఈ చియా సీడ్స్ బీట్ రూట్ మాస్క్ ను వేసుకోవడం వల్ల మరో అదిరిపోయే బెనిఫిట్ ఏంటి అంటే చర్మం ఎల్లప్పుడూ స్మూత్ గా షైనీ గా ఉంటుంది.