ముఖ్యంగా చెప్పాలంటే శరీరంలోని యూరిక్ యాసిడ్( Uric Acid ) ను దూరం చేసుకోవడానికి కొన్ని రకాల ఆహారాలను తీసుకోవాలి.అలాగే శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
యూరిక్ యాసిడ్ నియంత్రణ లో ఉంచుకోవడం ఎంతో ముఖ్యం.అలాగే మన శరీరంలో అనేక రకాల వ్యర్థ పదార్థాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి.
శరీరం నుంచి బయటకు వెళ్ల లేని వ్యర్థ పదార్థాలు మన శరీరంలోని వివిధ భాగాలలో పేరుకుపోవడం మొదలవుతుంది.ఈ వ్యర్థ పదార్థాలలో యూరిక్ యాసిడ్ ఉంటుంది.
కాబట్టి మనం ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి.ఎందుకంటే యూరిక్ యాసిడ్ పెరగడానికి ఇది ప్రధాన కారణం.

అలాగే కొన్ని కూరగాయలను( Vegetables ) తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ ను అదుపు చేసుకోవచ్చు.యూరిక్ ఆమ్లం నియంత్రణ కోసం ప్రతి రోజు క్యారెట్( Carrot ) తీసుకుంటూ ఉండాలి.క్యారెట్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.ఇది మన శరీరం నుంచి యూరిక్ యాసిడ్ మరియు ఇతర వ్యర్థ పదార్థాలను తొలగించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.అలాగే మన శరీరంలో పేరుకుపోతున్న యూరిక్ యాసిడ్ ను నియంత్రణలో ఉంచడానికి ఆకుకూరలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.వీటిని క్రమం తప్పకుండా మన డైట్ లో చేర్చుకోవడం వల్ల త్వరగా ఫలితాలు కనిపిస్తాయి.
అలాగే బచ్చలి కూర, మెంతులు( Fenugreek ), మొదలైన ఆకుకూరలు యూరిక్ యసిడ్ ను తగ్గిస్తాయి.

అలాగే విటమిన్ సి ( Vitamin C )మరియు అనేక ఇతర పోషకాలను కలిగి ఉన్న తీపి గుమ్మడి కాయను తీసుకోవడం వల్ల శరీరం నుంచి యూరిక్ యాసిడ్ బయటకు పోతుంది.ముఖ్యంగా చెప్పాలంటే బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్ మరియు లుటిన్ లక్షణాలు గుమ్మడికాయలో ఎక్కువగా ఉంటాయి.ఇది యూరిక్ యాసిడ్ ను నియంత్రణ చేయడానికి పని చేస్తుంది.
అలాగే విటమిన్ సి టొమాటో( Tomato )లో పుష్కలంగా ఉండడం వల్ల ఇది మన శరీరం నుంచి యూరిక్ యాసిడ్ ను తొలగించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.అలాగే టొమాటోలను సూప్‌లు, సలాడ్‌లు మరియు కూరగాయల రూపంలో ఆహారంలో తీసుకోవచ్చు.
ఇలా తీసుకోవడం వల్ల శరీరం నుంచి యూరిక్ యాసిడ్ ను బయటకు పంపవచ్చు.