ఉత్తర భారతదేశంలో చలి తన తీవ్రతను చూపిస్తోంది.చలి కాలంలో సీనియర్ సిటిజన్స్ అధికంగా ఆందోళన చెందడం మీరు చూసే ఉంటారు.
వారికి చలి ఎక్కువగా ఉండటం కారణంగా ఇబ్బంది పడుతుంటారు.ఇంతకీ వృద్ధులకు ఎందుకు చలి ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది? వారు జలుబుతో ఎందుకు బాధపడుతుంటారు అనే ప్రశ్న మీమదిలో కలిగేవుంటుంది.దానికి కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.సీనియర్ సిటిజన్ స్పెషలిస్ట్ అండ్ జెరియాట్రిక్ మెడిసిన్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం చలికాలంలో వృద్ధులకు మరింతగా చలిగా అనిపించేందుకు చాలా కారణాలున్నాయన్నారు.
వృద్ధాప్యంలో జీవక్రియ చాలా తక్కువగా ఉంటుందని, ఫలితంగా వారికి అత్యధికంగా చలిగా వుంటుందని తెలిపారు.
వృద్ధాప్యంలో చర్మం కింద ఉన్న కొవ్వు పొర క్రమంగా సన్నబడుతుందని, ఇది శరీరం యొక్క ఇన్సులేషన్ను తగ్గిస్తుందని వైద్యులు తెలిపారు.
దీని ఫలితంగానే వృద్ధులు శీతాకాలంలో మరింత చల్లగా ఉన్నట్లు అనుభూతి చెందుతారన్నారు.కాగా శరీరంలోని ఉపరితల సిరలు శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి.అయితే వయసు ప్రభావం కారణంగా ఈ సిరల్లో రక్త ప్రవాహం తగ్గుతుంది. దీని కారణంగా వృద్ధులు మరింత చల్లగా ఉన్నదని చెబుతుంటారన్నారు.
థర్మోర్సెప్టర్లు శరీర చర్మంలోని ప్రత్యేక కణాలు, ఇవి ఉష్ణోగ్రతలో వ్యత్యాసాన్ని గుర్తించగలవు.