సోషల్ మీడియాలో వేల కొలది వీడియోలు వైరల్ అయ్యే సంగతి మనకు తెలిసిందే.ఎప్పుడూ ఏదో ఒక వీడియో నెట్టింట సందడి చేస్తూనే ఉంటుంది.
ఈ క్రమంలోనే ప్రతీ ఒక్కరు తమ బిజీ లైఫ్‌లోనూ వైరల్ వీడియో కంటెంట్ చూసేందుకు ఆసక్తి చూపుతుంటారు.ప్రజెంట్ టైమ్స్‌లో దాదాపుగా అందరూ డిజిటల్లీ కనెక్టెడ్ అన్నట్లుగా ఉంటున్నారు.
ఇక పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసి ప్రతీ వీడియోను నెటిజన్లు ఆసక్తికరంగా చూడటం కామన్ అయిపోయింది.అయితే, ఆయన షేర్ చేయబోయే ప్రతీ వీడియో యూనిక్ ప్లస్ ఇంట్రెస్టింగ్‌గానే ఉండటం ఇందుకు కారణం.
తాజాగా ఆయన షేర్ చేసిన వీడియో నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది.ఈ వీడియో ద్వారా ఆనంద్ మహీంద్రా తన ఫ్యాన్స్, ఫాలోవర్స్,నెటిజన్స్ అందరికీ మంచి సందేశమిచ్చారు.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.‘ఎప్పుడూ వెనుకడుగు వేయకు’ అని క్యాప్షన్‌తో ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో కేవలం ఆరు సెకన్ల నిడివి కలిగినదే కాగా సోషల్ మీడియాలో అది తెగ వైరల్ అవుతున్నది.
సదరు వీడియోలో హౌజ్‌లోకి ఎంటర్ అయ్యేందుకుగాను పెంపుడు డాగ్ ప్రయత్నిస్తూనే ఉంటోంది.
ఈ వీడియో న్యూయార్క్‌లోని తన ఫ్రెండ్ హౌజ్‌లో తీసిందని ఆనంద్ మహీంద్ర తెలిపాడు.ఇకపోతే వీడియోలో విశ్వాసానికి ప్రతీక అయిన డాగ్ ఇంట్లోకి అలుపెరగని ప్రయత్నం చేస్తుండగా చివరకు దాన్ని ఇంట్లోకి అనుమతించారు.ఈ క్రమంలో ప్రతీ ఒక్కరు ఈ డాగ్ లా ప్రయత్నాలు చేయాలని స్ఫూర్తి నింపారు ఆనంద్ మహీంద్రా.
తమ ఆకాంక్షను నెరవేర్చుకునేందుకుగాను కఠిన ప్రయత్నం చేస్తే ఫలితం తప్పక లభిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో ‘ఎప్పుడూ వెనుకడుగు వేయకూడదని’ ఆనంద్ మహీంద్ర యూత్‌కు దిశా నిర్దేశం చేశారు.ఇక ఈ వీడియో చూసి నెటిజన్లు ఇన్‌స్పైర్ అవుతున్నారు.
ఆనంద్ మహీంద్రా ఇచ్చిన సందేశం గొప్పదని కామెంట్స్ చేస్తున్నారు.