మునక్కాయలు, మునగాకు లలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి.ఈ మునక్కాయలను ఉపయోగించి ఎన్నో రకాల వంటలు కూడా చేస్తూ ఉంటారు.
అయితే మునక్కాయలతో( Drumstick ) ఎలాంటి వంట చేసినా కూడా ప్రతి ఒక్కరూ లొట్టలు వేసుకుని మరి తింటూ ఉంటారు.ఇక వర్షాకాలంలో ( Monsoon ) మునక్కాయలు చాలా విరివిగా దొరుకుతాయి.
మునక్కాయలు తినడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.వీటిని తీసుకోవడం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
మునక్కాయలో విటమిన్ ఏ, బి1, బి2, బి3, బి5, బి6, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, సోడియం, జింక్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

అంతే కాకుండా డైటరి ఫైబర్( Dietary Fiber ) కూడా ఇందులో అధికంగా ఉంటుంది.మునక్కాయలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి.అంతేకాకుండా మునక్కాయను మన డైట్ లో చేర్చుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
ఇక చిన్నారులకు ఎముకల అభివృద్ధిలో కూడా ములక్కాడలు తోడ్పడతాయి.అంతేకాకుండా వృద్ధులకు కూడా ప్రయోజనాలు ఉంటాయి.
ఇకపోతే వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆర్థరైటిస్ కు చికిత్స చేస్తాయి.అంతేకాకుండా ఎముక పగుళ్లు చిన్నగా ఉంటే వాటిని నయం కూడా చేస్తాయి.
ఇక మునక్కాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.కాబట్టి ఇది ఫ్లూ ఇక అనేక ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి.

మునక్కాయలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.దగ్గు( Cough ) ఉన్నవారు కూడా వీటిని తీసుకోవడం వలన దగ్గు నుండి ఉపశమనాన్ని పొందవచ్చు.ఇక జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేయడానికి కూడా మునక్కాయలు సహాయపడతాయి.వీటిలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులను సరళమైన రూపాల్లోకి విచ్ఛిన్నం చేయడానికి తోడ్పడుతుంది.అలాగే మునక్కాయను డైట్ లో చేర్చుకోవడం వలన కిడ్నీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు లాంటి ముప్పును కూడా తగ్గిస్తుంది.అంతేకాకుండా జుట్టు సమస్యలు కూడా దూరం అవుతాయి.







