హార్మోన్ల అసమతుల్యతకు చెక్ పెట్టాలంటే ఇవి పాటించాల్సిందే!

ఇటీవ‌ల రోజుల్లో మ‌హిళ‌లు అత్య‌ధికంగా ఫేస్ చేస్తున్న స‌మ‌స్య‌ల్లో హార్మోన్ల అసమతుల్యత( Hormonal Imbalance ) ముందు వ‌ర‌స‌లో ఉంది.కంటి నిండా నిద్ర లేకపోవడం, మానసిక ఒత్తిడి, వేల‌కు ఆహారం తీసుకోక‌పోవ‌డం, జీవ‌న‌శైలిలో మార్పులు, ధూమపానం, మద్యపానం.

 Natural Ways To Balance Your Hormones! Hormonal Imbalance, Hormonal Imbalance Ef-TeluguStop.com

ఇవన్నీ హార్మోన్ల పని తీరును దెబ్బ తీస్తాయి.దాంతో హార్మోన్ల అసమతుల్యత త‌లెత్తుతుంది.

దీని కార‌ణంగా థైరాయిడ్‌, నెలసరి క్ర‌మం త‌ప్ప‌డం, ప్రత్యుత్పత్తి స‌మ‌స్య‌లు, బ‌రువు పెర‌గ‌డం లేదా త‌గ్గ‌డం, జీర్ణ వ్య‌వ‌స్థ నెమ్మ‌దించ‌డం, మధుమేహం, డిప్రెష‌న్‌, మెనోపాజ్ త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌న్నీ ఏర్ప‌డ‌తాయి.

అందుకే హార్మోన్లు పనితీరు సక్రమంగా ఉంచుకోవాల‌ని నిపుణులు చెబుతుంటారు.

అయితే ఇన్ని అనారోగ్యాలకు కారణమయ్యే హార్మోన్లను తిరిగి సమతుల్యం చేసుకోవాలంటే.ఖ‌చ్చితంగా కొన్నిటిని పాటించాల్సిందే.

అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌కు చెక్ పెట్టాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవ‌డం అల‌వాటు చేసుకోవాలి.

అంటే శరీరానికి అన్ని పోషకాలు అందే విధమైన ఆహారం తీసుకోవాలి.సీజ‌న‌ల్ పండ్లు, కూర‌గాయ‌లు, ఆకుకూర‌లు, ప‌ప్పుధాన్యాలు, న‌ట్స్‌, గుడ్లు, చేప‌లు ( Fish ).ఇలా పోష‌కాలు మెండుగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

Telugu Tips, Latest-Telugu Health

ఆయిల్‌ పుల్లింగ్‌తో హార్మోన్ల అసమతుల్యతకు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని మీకు తెలుసా.అవును, రోజు ఉద‌యం ఐదు నిమిషాల పాటు ఆయిల్ పుల్లింగ్ చేస్తే నోటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.అదే స‌మ‌యంలో శరీరంలోని టాక్సిన్లు బయటికి వెళ్లిపోయి జీవక్రియల ప‌నితీరుతో పాటు హార్మోన్ల పనితీరు కూడా మెరుగవుతుంది.

హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌కు చెక్ పెట్టాలంటే ఉద‌యం లేలేత ఎండలో ఓ అరగంట గడపండి.

Telugu Tips, Latest-Telugu Health

అలాగే రెగ్యుల‌ర్ గా వ్యాయామాలు( Exercises ) చేయండి.వాకింగ్‌, జాగింగ్, స్విమ్మింగ్ త‌దిత‌ర వ్యాయామాలు చెయ్యడం అలవర్చుకోవాలి.త‌ద్వారా హార్మోన్లు స‌మ‌తుల్యం అవుతాయి.

ఖాళీ క‌డుపుతో కాఫీ తాగే అల‌వాటు ఉంటే మానుకోండి.ఎందుకంటే, ఆమ్ల స్వభావం ఎక్కువగా ఉన్న కాఫీ పరగడుపున తీసుకోవడం వల్ల హార్మోన్లపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

ఇక ధుమ‌పానం, మ‌ద్య‌పానం అల‌వాట్ల‌ను మానుకోండి.వేల‌కు ఆహారం తీసుకోవ‌డం అల‌వాటు చేసుకోండి.

పెయిన్ కిల్ల‌ర్స్ ను అధికంగా వినియోగించ‌డం ఆపండి.కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోండి.

త‌ద్వారా హార్మోన్ల అసమతుల్యత స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube