బీజేపీ సిద్ధాంతమే ఊపిరిగా పార్టీలో పని చేస్తున్నట్లు తెలంగాణ నూతన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న వారికి పదవులు అవే వస్తాయన్నారు.
కేంద్రమంత్రిని అవుతానని కలలో కూడా ఊహించలేదని చెప్పారు.ప్రపంచం అంతా మోదీ నాయకత్వం వైపు చూస్తోందని తెలిపారు.
మోదీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తుందని పేర్కొన్నారు.తెలంగాణలోనూ బీజేపీనే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.







