బొబ్బర్లు.వీటి గురించి పరిచయాలు అవసరం లేదు.వీటినే కొందరు అలసందలు అని కూడా పిలుస్తుంటారు.బొబ్బర్లతో వడలు ఎక్కువగా వేస్తుంటారు.కొందరు ఉడకబెట్టుకుని కూడా తింటుంటారు.ఎంతో రుచిగా ఉండే బొబ్బర్లు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.
నవధాన్యాల్లో ఒకటైన ఈ బొబ్బర్లు ఎన్నో అనారోగ్య సమస్యలను సైతం నయం చేస్తుంది.మరి బొబ్బర్లు మనకు చేసే మేలేంటి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగితే.గుండె పోటు మరియు ఇతర గుండె జబ్బులు వస్తుంటాయి.అలా రాకుండా చేయాలంటే.రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవాలి.
అయితే అందుకు బొబ్బర్లు అంద్భుతంగా సహాయపడతాయి.రోజుకో కప్పు నానబెట్టి ఉడికించిన బొబ్బర్లు తీసుకోవడం వల్ల అందులో ఉండే ఫ్లెవనాయిడ్స్ మరియు పొటాషియం రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.
ఇక బొబ్బర్లతో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.మధుమేహం వ్యాధి గ్రస్తులు బొబ్బర్లు తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా బొబ్బర్లు బెస్ట్ ఆప్షన్.ఎందుకంటే, బొబ్బర్లలో కేలరీలు, కొవ్వు తక్కువగా.ఫైబర్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి.కాబట్టి, ఇవి తినడం వల్ల అధిక సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది.
దాంతో వేరే ఆహారానికి దూరం ఉండొచ్చు.అధిక బరువు చెక్ పెట్టవచ్చు.
బొబ్బర్లతో మరో అద్భుతమైన ప్రయోజనం ఏంటంటే.అధిక రక్తపోటును కంట్రోల్ చేస్తుంది.ఇక యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండె బొబ్బర్లు తీసుకోవడం వల్ల.రకరకాల రోగాలు దరిచేరకుండా ఉంటాయి.
కాబట్టి, బొబ్బర్లే కదా అని నిర్లక్ష్యం చేయకుండా.అందరూ వీటిని డైలీ డైట్‌లో తీసుకుంటే పైన చెప్పుకున్న బెనిఫిట్స్ అన్నీ పొందొచ్చు.