Hairfall Tips : రెండు వారాల్లో హెయిర్ ఫాల్ కు అడ్డుకట్ట వేసే మిరాకిల్ ఆయిల్ ఇది.. త‌ప్ప‌క ట్రై చేయండి!

మనలో చాలా మందిని హెయిర్ ఫాల్ సమస్య తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటుంది.జుట్టు అధికంగా రాలిపోవడం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతుంటారు.

 This Is A Miracle Oil That Prevents Hair Fall In Two Weeks-TeluguStop.com

జుట్టు రాలడాన్ని ఎలా అడ్డుకోవాలో అర్థంగాక సతమతం అయిపోతుంటారు.కొందరు డాక్టర్లను కన్సల్ట్ చేసి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకునేందుకు మందులు కూడా వాడుతుంటారు.

అటువంటి తీవ్రమైన హెయిర్ ఫాల్ తో ఇబ్బంది పడుతున్న వారికి ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ ఆయిల్ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.ఈ ఆయిల్ ను వాడారంటే కేవలం రెండు వారాల్లోనే మీ జుట్టు రాలడం కంట్రోల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం జుట్టు రాలడాన్ని అరికట్టే ఆ మిరాకిల్ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Care, Care Tips, Fall, Oil, Healthy, Miracle Oil, Thick-Telugu Health

ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకుని పీల్ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఎనిమిది నుంచి పది వెల్లుల్లి రెబ్బలను తీసుకొని శుభ్రంగా పొట్టు తొలగించి పెట్టుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు మరియు మూడు రెబ్బలు కరివేపాకు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక గ్లాసు ఆవ నూనె పోసుకోవాలి.ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసి చిన్న మంట పై దాదాపు 15 నిమిషాల పాటు ఉడికించాలి.

బాగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ లో చల్లార‌పెట్టుకోవాలి.

Telugu Care, Care Tips, Fall, Oil, Healthy, Miracle Oil, Thick-Telugu Health

ఆపై క్లాత్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి.హెయిర్ ఫాల్ కు అడ్డుకట్ట వేసే సామర్థ్యం ఈ ఆయిల్ కు ఉంది.వారంలో కనీసం మూడుసార్లు ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి మసాజ్ చేసుకోవాలి.

ఉల్లి, వెల్లుల్లి, కరివేపాకు మరియు ఆవ నూనెలో ఉండే పలు సుగుణాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.జుట్టు రాలడాన్ని అరికడతాయి.హెయిర్ ఫాల్ సమస్య ఎంత తీవ్రంగా ఉన్నా సరే ఈ నూనెను వాడారంటే రెండు వారాల్లోనే మీరు మంచి రిజల్ట్స్ గమనిస్తారు.పైగా ఈ ఆయిల్ కురులను ఒత్తుగా పొడుగ్గా పెరిగేలా సైతం ప్రోత్సహిస్తుంది.

కాబట్టి తప్పకుండా ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube