అమృతం సేవించిన దేవతలకు నైవేద్యం దేనికి ?

మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనకు మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు.అయితే వీరంతా ఒకే చోట లేకపోయినప్పటికీ… ఒక్కో చోట క్కో రకమైన దేవుడు ఉన్నాడు.

 What Is The Use Of We Offering Naivedyam To God Who Drank The Amrutham , Devotio-TeluguStop.com

కాకపోతే మనం వీరిందరినీ కొలుస్తుంటాం.అంతేనా వీరికి ప్రత్యేక పూజలు , పునస్కారాలు చేస్తూ మన భక్తిని చాటుకుంటూ ఉంటాం.

అందులో భాగమే ఈ నైవేద్యం సమర్పించడం కూడా.అయితే మనం దాదాపుగా అన్ని దేవుళ్లకు నైవేద్యం సమర్పిస్తుంటాం.

ఆలయాల్లో వుండే దేవతలు అమృతం తాగిన వారు కాదు.అమృతం అందించిన వారు.

ఆలయాలలో మనం చేసే నివేదనలు ఆ విగ్రహాల ఆరగింపుకు కాదు, ఆ విగ్రహ రూపంలో వున్న దైవం అనుగ్రహించి మనకు అందజేసిన ఆహారాన్ని ఆ దైవానికి నివేదన చేసి మనం ఆరగించడానికి.

కాబట్టి మనం ఎలాంటి అనుమానాలు లేకుండా గుడులు, పూజ గదుల్లోని దేవళ్లు.

దేవతలకు నైవేద్యం సమర్పించవచ్చు.అంతే కాదండోయ్ ఆ ప్రసాదాన్ని మనం కూడా తిని పుణ్యం పొందవచ్చు.

నైవేద్యం అనేది భుజించడానికి ముందు దేవునికి ఆహారము సమర్పించు ప్రక్రియ.కావున దేవునికి ఆహారము సమర్పించే ముందు అంటే ఆ ఆహారము వండేటపుడు దాని రుచి చూడటము నిషిద్ధం.

ఆహారమును దేవుని మూర్తి ముందు ఉంచి పూజించాలి.ఆ తర్వాతే మనం కూడా తినాల్సి ఉంటుంది.

అయితే నైవేద్యానికి, ప్రసాదానికి చాలా తేడా ఉంది.నైవేద్యం అంటే మనం సమర్పించేది.

ప్రసాదం అంటే దేవుడి దగ్గరే తయారయ్యేది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube