ఫిబ్రవరి 18వ తేదీన మహా శివరాత్రి పండుగను మన దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు పండుగ రోజున ఎక్కువ మంది ప్రజలు రుద్రాక్షలు ధరిస్తారు.రుద్రాక్ష శివుడికి సంబంధించినది.
అందుకే శివరాత్రి రోజున రుద్రాక్షను ధరిస్తే మంచి జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు.రుద్రాక్ష ధరించడం వల్ల కష్టాలు నశించి, దుఃఖాలు, గ్రహ దోషాలు దూరం అయిపోతాయని చెబుతూ ఉంటారు.
జీవితంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ఆస్తులు, అన్ని లభిస్తాయని చెబుతారు.ఎవరు పడితే వారు, ఎప్పుడు పడితే అప్పుడు అసలు రుద్రాక్ష ధరించకూడదు.దానికి కొన్ని నియమాలు ఉన్నాయి.మన దేశంలో ప్రతి సంవత్సరం 300 నుంచి 500 కోట్ల మేర రుద్రాక్షల వ్యాపారం జరుగుతుందని తాజా గుణాంగా చెబుతున్నాయి.

మనం ఈ రోజు రుద్రాక్షలు ఎలా పుట్టాయి.ఇవి ఎన్ని రకాలు ఉన్నాయి.వాటి వల్ల ఏం లాభం వుందో ఇప్పుడు తెలుసుకుందాం.పురాణా గ్రంధాల ప్రకారం శివుడు వెయ్యి సంవత్సరాల పాటు ధ్యానంలో ఉన్నాడు.ఒక రోజు అకస్మాత్తుగా కళ్ళు తెరిచి చూసినప్పుడు ఆయన ముందు ఒక కన్నీటి చుక్క భూమి పై పడింది.దాని నుంచి రుద్రాక్ష ఉద్భవించినట్లు వేద పండితులు చెబుతున్నారు.
శివుని ఆజ్ఞతో మానవ కల్యాణం కోసం రుద్రాక్ష వృక్షాలు భూమి అంత వ్యాపించాయి.ఇదే శివునికి రుద్రాక్ష కు ఉన్న సంబంధం అని వేద పండితులు చెబుతూ ఉంటారు.

శాస్త్రం ప్రకారం విధి విధానాలతో పూజలు జరిపించి నిర్ణీతమైన ముహూర్తంలో రుద్రాక్షను మెడలో ధరించాలి.రుద్రాక్షలు ధరించుట వలన గుండెజబ్బులు, బిపి, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని చాలా మంది ప్రజలు గట్టిగా నమ్ముతారు.రుద్రాక్షలు అందరూ ధరించవచ్చు.కానీ మద్యపానం సమయంలో, నిద్ర పోతున్నాపుడు, అంత్యక్రియల సమయంలో మాత్రం అసలు ధరించకూడదు.ముఖ్యంగా చెప్పాలంటే మద్యపానం, ధూమపానం చేసేవారు రుద్రాక్షను ధరించకూడదు.
DEVOTIONAL