మీ జుట్టు బలోపేతం అవ్వాలా? అయితే ఈ ఒక్క చిట్కా చాలు!

బ‌ల‌హీన‌మైన కురులు.ఇటీవ‌ల రోజుల్లో చాలా మందిని వేధించే జుట్టు స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.

 How To Strong Hair Roots? Hair Roots, Hair Pack, Latest News, Healthy Hair, Hair-TeluguStop.com

కురులు బ‌ల‌హీనంగా మార‌డానికి చాలా కార‌ణాలే ఉన్నాయి.ప్రోటీన్ లోపం, ప‌లు ర‌కాల విట‌మిన్ల కొర‌త‌, ఆహార‌పు అల‌వాట్లు, వాతావ‌ర‌ణంలో కాలుష్యం, ర‌సాయ‌నాలు ఎక్కువ‌గా ఉండే షాంపూల‌ను వాడ‌టం, హీటింగ్ హెయిర్ ప్రొడక్ట్స్ ను త‌ర‌చూ వినియోగించ‌డం.

ఇవ‌న్నీ కురుల కుదుళ్ల‌ను బ‌ల‌హీన ప‌రిచే అంశాలే.కేశాలు బ‌ల‌హీనంగా మారే కొద్ది హెయిర్ ఫాల్ విప‌రీతంగా పెరిగిపోతుంది.

ఒత్తుగా ఉండే జుట్టు క్ర‌మంగా ప‌ల్చ‌బ‌డిపోతుంది.

ఈ క్ర‌మంలోనే ఏం చేయాలో తెలియ‌క‌.

జుట్టును ఎలా బ‌లోపేతం చేసుకోవాలో అర్థంగాక మ‌ద‌న ప‌డిపోతూ ఉంటారు.కొంద‌రు ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం కోసం హాస్ప‌ట‌ల్స్ చుట్టూ తిరుగుతూ ర‌క‌ర‌కాల మందుల‌ను వాడుతుంటారు.

అయితే ఎలాంటి ఖ‌ర్చు లేకుండా ఇంట్లోనే ఒకే ఒక్క చిట్కాతో జుట్టును బ‌లోపేతం చేసుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక ఉల్లిపాయ తీసుకుని పీల్ తొల‌గించి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఉల్లిపాయ ముక్క‌ల‌ను మెత్త‌గా పేస్ట్ చేసి జ్యూస్‌ను వేరు చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఉల్లిపాయ ర‌సం, ఒక గుడ్డు పచ్చ సొన‌, మూడు టేబుల్ స్పూన్ల ప‌చ్చి పాలు, ఒక స్పూన్ ఆముదం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి ష‌వ‌ర్ క్యాప్ పెట్టేసుకోవాలి.

గంట అనంత‌రం మైల్డ్ షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేయాలి.నాలుగు రోజుల‌కు ఒక సారి ఇలా చేస్తే జుట్టు బ‌లంగా, దృఢంగా మారుతుంది.

అదే స‌మ‌యంలో హెయిర్ ఫాల్‌, హెయిర్ డ్యామేజ్‌, స్ప్లిట్ హెయిర్ వంటి స‌మ‌స్య‌ల నుంచి సైతం విముక్తి ల‌భిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube