మెగా కోడలు ఉపాసన (Upasana)తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఉపాసన జీవితానికి సంబంధించి అలాగే బంధాలు (Relation)బంధుత్వాలకు ఉన్న ప్రాధాన్యతను గురించి వివరించారు.
ముఖ్యంగా వైవాహిక జీవితంలో ఎలా ముందుకు సాగాలి అనే విషయాల గురించి ఉపాసన తెలిపారు.ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించేటప్పుడు అందర కలిసి సమీక్షలు ఎలా చేస్తామో… బంధాల విషయంలో కూడా సమీక్ష అనేది తప్పనిసరి అని ఉపాసన తెలిపారు.
వైవాహిక జీవితం అనేది పూల పాన్పు లాంటిది కాదని ఉపాసన వెల్లడించారు.ఇద్దరి మధ్య సరైన అవగాహన ఉన్నప్పుడే వారి బంధం బలపడుతుందని చరణ్(Charan) నా విషయంలో అదే జరుగుతోందని ఉపాసన తెలిపారు.

చరణ్ నేను ఇద్దరం కూడా ఒకే స్థాయి నుంచి వచ్చాము పెళ్లికి ముందు మాకు బంధం పై ఎంతో మంచి అవగాహన ఉంది.మనిషి విలువ, నమ్మకం, ఆరోగ్యకరమైన బంధాల కొనసాగించడం, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను స్థిరంగా ఎదుర్కొనగలిగే లక్షణం చరణ్‌లో ఉంది.తండ్రి నుంచి అవి వచ్చాయి.అలాంటి గొప్ప లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు మహిళలు ఉన్నత స్థాయిలో ఉండటానికి ఎంతగానో దోహదం చేస్తారు.నా ప్రతి విషయంలోనూ అదే జరుగుతోంది.నా ప్రతి దశలోను చరణ్ నా వెంటే ఉన్నారు అదే నా విజయానికి రహస్యం అంటూ తన భర్త గురించి ఉపాసన ఎంతో గొప్పగా చెప్పారు.

మా కుటుంబం మొత్తం ఎప్పుడు మా చుట్టూనే ఉంటుంది.ఎలాంటి సమయంలోనైనా ఇద్దరం ఒకరికొకరు తోడుగా ఉంటాం అది మా కుటుంబమైన చరణ్ కుటుంబమైనా.మేము పనులలో ఎంత బిజీగా ఉన్నా మాకంటూ కొంత సమయం కేటాయించుకుంటామని ఉపాసన తెలిపారు.వారానికి ఒక్కసారైనా డేట్ నైట్ ఉండాలని అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉంటుంది.
ఈ డేట్ నైట్ లో ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఫోన్లు, టీవీలు దూరం పెట్టేస్తాం.ఇక మా ఇద్దరి మధ్య ఏదైనా సమస్యలు వస్తే తప్పకుండా ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం.
అలా చేస్తే బంధం బలపడుతుంది.అది మరణించే వరకూ కొనసాగుతూనే ఉండాలి అంటూ వైవాహిక జీవితం గురించి ఉపాసన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.