మంచు కుటుంబంలో(Manchu Family) గత కొద్ది రోజులుగా వివాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.మంచు మోహన్ బాబు మంచు విష్ణుతో మనోజ్(Manoj) ఆస్తులు విషయమై పోరాటం చేస్తున్నారు.
ఇలా వీరి ఆస్తికి సంబంధించిన వివాదాలు గతంలో నాలుగు గోడల మధ్య ఉండేది కానీ ఇప్పుడు నలుగురిలో బయటపడటంతో తరచూ వీరికి సంబంధించి ఏదో ఒక విషయం బయటకు వస్తోంది.ఇప్పటికే రోడ్లపైనే ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం పోలీస్ స్టేషన్లకి వెళ్లి ఒకరిపై మరొకరు కేసు పెట్టుకోవడం జరిగింది.

ఇలా మంచు కుటుంబంలో జరుగుతున్న ఈ గొడవలు దాదాపు ముగిసిపోయాయని అందరూ భావిస్తున్న తరుణంలో మంచు మనోజ్ మరోసారి తన అన్నయ్య విష్ణుకి(Vishnu) ఊహించని షాక్ ఇచ్చారు.తాజాగా మనోజ్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో తన అన్నయ్య విష్ణు పై దొంగతనం కేసు ఫిర్యాదు చేశారు దీంతో మరోసారి ఈ కుటుంబంలోని తగాదాలు బయటపడ్డాయి.మంచు విష్ణు తన కారుతో పాటు కొన్ని విలువైన వస్తువులను దొంగతనం చేసినట్లు మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇకపోతే తన అన్నయ్య 150 ఇబ్బందితో వచ్చి విధ్వంసం సృష్టించారంటూ ఫిర్యాదులో తెలిపారు.ఈ విధంగా మంచి విష్ణు పై మనోజ్ చేసినటువంటి ఈ ఫిర్యాదు సంచలనంగా మారింది.అయితే ఈ విషయం గురించి మంచు విష్ణు స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.
అయితే ప్రస్తుతం మంచు విష్ణు తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప (Kannappa)సినిమా ఏప్రిల్ 25వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.ఇలా తన అన్నయ్య సినిమా విడుదల సమయంలో మనోజ్ విష్ణు పై కేసు పెట్టడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.