మాములుగా సినిమాలలో హీరోలు బూతులు మాట్లాడడం అన్నది కామన్.కొన్నిసార్లు బూతులు మ్యూట్ చేస్తే మరి కొన్ని సార్లు సెన్సార్ లో కట్ అవుతూ ఉంటుంది.
కొన్నిసార్లు బూతులను మ్యూట్ కూడా చేయరు.ఇలాంటి సమయంలోనే సోషల్ మీడియాలో( social media ) నెగిటివ్ కామెంట్స్ విమర్శలు కూడా వస్తూ ఉంటాయి.
ఆ సంగతి పక్కన పెడితే ఇప్పటివరకు చాలా వరకు సినిమాలలో హీరోలే బూతులు మాట్లాడడం మనం చూసి ఉన్నాం.అయితే ఎప్పుడూ హీరోలే ఎందుకు బూతులు మాట్లాడాలి.
హీరోయిన్లు ఎందుకు మాట్లాడకూడదనే ఆలోచన వచ్చినట్టు ఉంది నిర్మాత నాగవంశీకి.

తన నెక్ట్స్ సినిమాలో హీరోయిన్ ను అలానే చూపించబోతున్నాడు.ఆ హీరోయిన్ మరెవరో కాదు, వైష్ణవి చైతన్య( Vaishnavi chaitanya ).ఈ సందర్భంగా నిర్మాత నాగ వంశీ ఈ విషయం గురించి మాట్లాడుతూ.మా నెక్ట్స్ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య.ఇప్పటి వరకు ఒక రకంగా చూశారు ఆమెని.కానీ మేం ఆమెను చాలా మాస్ గా చూపించబోతున్నాము.వైష్ణవిని చివరిసారి పద్ధతిగా చూసేయండి.
మా సినిమాలో ఆమె మామూలుగా ఉండదు.అన్నీ బూతులే మాట్లాడుతుంది.
మోడ్రన్ బూతులు మాట్లాడుతుంది.

నా సినిమాలో ఈ అమ్మాయిని చాలా బ్యాడ్ గా చూపిస్తాము.ఒక హీరోయిన్ కు నాగవంశీ( Nagavanshi ) ఇచ్చిన ఎలివేషన్ ఇది.త్వరలోనే ఆ సినిమా సంగతులు బయటపెడతానంటున్నాడు ఈ నిర్మాత.మరి ఈ విషయంపై కొందరు నెగటివ్ గా స్పందింస్తుండగా మరి కొందరు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.ఇకపోతే హీరోయిన్ వైష్ణవి చైతన్య విషయానికి వస్తే.వైష్ణవి మొదట బేబీ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఇటీవల లవ్ మీ మూవీతో ప్రేక్షకులను పలకరించింది.
ప్రస్తుతం మరికొన్ని సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.