1.కరువు మండలాలు ప్రకటించా
లి
ఏపీలో రైతుల పరిస్థితి దుర్భరంగా మారిందని వెంటనే కరువు మండలాలను ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్దరాజు డిమాండ్ చేశారు.
2.విజయవాడలో రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయం
విజయవాడ కేంద్రంగా త్వరలో రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయం ప్రారంభం కానుంది.ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు రీజనల్ పాస్ పోర్ట్ అధికారి శివ హర్ష.
3.రేవంత్ రెడ్డి పై కేటీఆర్ విమర్శలు
తాము ప్రతీకార రాజకీయాలు చేయలేదని , అలా చేసి ఉంటే డబ్బు కట్టలతో దొరికిన రేవంత్ రెడ్డి( Revanth reddy ) ఈపాటికి ఊచలు లెక్కపెట్టేవారని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
4.విజయవాడ నుంచి అమృత్ కలస యాత్ర ప్రారంభం
రాజాధిక అమృత్ మహోత్సవాల్లో భాగంగా నా మట్టి నాదేశం కార్యక్రమం ముగింపు దశకు చేరుకుంది. దీంతో విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి అమృత్ కలస యాత్ర ప్రారంభమైంది.
5.చంద్రబాబు తో ములఖత్
టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు అయ్యి నేటికీ 50 రోజులు పూర్తయింది .నేడు చంద్రబాబుతో లోకేష్ భువనేశ్వరిలు ములకత్ కానున్నారు.
6.టిడిపి జనసేన సమన్వయ సమావేశాలు
రేపటి నుంచి టిడిపి జనసేన సమన్వయ సమావేశాలు ప్రారంభం కానన్నాయి.ఈనెల 29 ,30, 31 తేదీల్లో ఈ సమావేశాలు జరుగుతాయి.
7.సిపిఐ నారాయణ కామెంట్స్
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ అనుమతి లేకుండా చంద్రబాబును జగన్ అరెస్ట్ చేయలేరని నారాయణ అన్నారు.
8.చిరుత సంచారం
తిరుమల నడక మార్గంలో మళ్లీ చిరుత సంచారం మొదలైంది దీంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు.
9.చంద్రబాబు భద్రతపై జైలు శాఖ ప్రకటన
టిడిపి నేత చంద్రబాబు రాజమండ్రి జైలులో తన భద్రత ఆరోగ్యం పై ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాసిన నేపథ్యంలో దీనిపై జైలు శాఖ డిఐజి రవికిరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబుకు 24 గంటలు మొదటి నుంచి సెక్యూరిటీ ఏర్పాటు చేశామని అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
10.పురపాలక పట్టణ అభివృద్ధి పై జగన్ సమీక్ష
పొరపాలక పట్టణ అభివృద్ధి శాఖపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
11.మంత్రి హరీష్ రావు విమర్శలు
మోసం దగాకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించారు.
12.నారా లోకేష్ ఆవేదన
చంద్రబాబును చంపేస్తామని బహిరంగంగానే వైసీపీ నాయకులు చెబుతున్నారు.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) ఆవేదన వ్యక్తం చేశారు.
13.పురందరేశ్వరిపై విజయ్ సాయి రెడ్డి విమర్శలు
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరిది నిలకడ లేని రాజకీయమని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి విమర్శించారు.
14. ఎన్నికల్లో పోటీ చేయను : బాబు మోహన్
పార్టీలో తనకు ఎన్నో అవమానాలు జరిగాయని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని బిజెపి నేత బాబు మోహన్ ప్రకటించారు.
15.ఇటలీకి వెళ్ళిన పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన భార్యతో కలిసి ఇటలీకి బయలుదేరి వెళ్లారు.
16.ఈటెల రాజేందర్ కామెంట్స్
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతవరకు కల్వకుంట్ల కుటుంబంలోని వ్యక్తి సీఎం అవుతారని బిజెపి నేత హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్( Etela Rajender ) విమర్శించారు.
17.మంత్రి పువ్వాడ విమర్శలు
మంత్రి పదవి ఇవ్వకపోతే తుమ్మల ఇప్పటికే రాజకీయాలనుంచి రిటైర్ అయ్యే వారిని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ విమర్శించారు.
18.మేడిగడ్డ బ్యారేజ్ ఘటనపై కేంద్రం లేఖ
మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పిల్లర్లు కుంగిని ఘటనపై మరింత సమాచారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది.
19.తుమ్మల నాగేశ్వరావు కామెంట్స్
కెసిఆర్ కు తానే మంత్రి పదవి ఇప్పించాలని మాజీ మంత్రి కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరావు( Thummala Nageswara Rao ) అన్నారు.
20.మార్చిలో ఏపీ ఎన్నికలకు నోటిఫికేషన్
ఏపీలో సాధారణ ఎన్నికల నిర్వహణకు మార్చిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.