సినిమా ఇండస్ట్రీలో కొనసాగి ఎంతో మంది సెలెబ్రెటీలు రాజకీయాలలోకి వెళ్లి రాజకీయాలలో కూడా మంచి ఉన్నత పదవులను అందుకుంటున్న విషయం తెలిసిందే.ఇలా ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు రాజకీయాలలో కీలక పదవులలో ఉన్నారు.
ఇకపోతే గతంలో చిరంజీవి( Chiranjeevi ) సైతం ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత రాజకీయాలలోకి వచ్చిన సంగతి తెలిసిందే.ఈయన కూడా ప్రజారాజ్యం పార్టీని( Prajarajyam Party ) స్థాపించి ఎన్నికల పోటీకి దిగారు అయితే ఈ ఎన్నికలలో మాత్రం చిరంజీవిది అనుకున్న స్థాయిలో మెజారిటీ రాకపోవడంతో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి కలిపివేశారు.

ఇలా ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన తర్వాత తనకు రాజకీయాలు సెట్ కావు అంటూ చిరంజీవి పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకొని సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.ఇక ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపిన తర్వాత తన తమ్ముడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) జనసేన పార్టీని( Janasena Party ) స్థాపిస్తూ జనసేన పార్టీ కార్యకలాపాలలో బిజీగా మారిపోయారు.ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏకంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కూడా బాధ్యతలను అందుకున్నారు.ఇలాంటి తరుణంలోని చిరంజీవి గత కొంతకాలంగా సినిమా షూటింగులను కూడా పక్కనపెట్టి కొంతమంది రాజకీయ నాయకులతో కలిసి తరుచూ బేటి అవుతున్న నేపథ్యంలో చిరంజీవి కూడా రాజకీయాలలోకి రాబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇలా తిరిగి రాజకీయాలలోకి రాబోతున్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎంతో మంది చిరంజీవిపై విమర్శలు కూడా చేశారు.ఇలా తన గురించి ఇలాంటి వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో చిరంజీవి రాజకీయాలలోకి రావడం గురించి స్పందించారు.ఇటీవల బ్రహ్మానందం సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన ఈయన రాజకీయాల గురించి మాట్లాడుతూ… జీవితాంతం తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటానని తెలిపారు.ఇక ఈ జీవితం మొత్తం కళామతల్లి సేవలోనే గడుపుతానని చిరంజీవి వెల్లడించారు.
నేను కొంతమంది రాజకీయ ప్రముఖులను కలుస్తున్నది సినిమా రంగం అభివృద్ధి కోసమేనని తెలిపారు.అలాగే రాజకీయాలలో తన లక్ష్యాలు, సేవాభావాన్ని పవన్ కళ్యాణ్ నెరవేరుస్తారు అంటూ ఈయన పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.