ఈ కూరలను పచ్చిగా తింటే ఏమవుతుందో తెలిస్తే...ఎప్పుడు వాటి జోలికి వెళ్లరు

పచ్చి కూరలను తినటం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని చాలా మంది తింటూ ఉంటారు.అయితే కొన్ని కూరలను పచ్చిగానూ…కొన్ని కూరలను ఉడకబెట్టి తినాలి.

 Foods You Should Never Eat Raw-TeluguStop.com

ఆలా కొన్ని కూరలను ఉడకబెట్టకుండా తింటే రోగ నిరోధక శక్తి తగ్గి ఇన్ ఫెక్షన్స్ వస్తాయి.నిపుణులు కొని ఆహారాలను పచ్చిగా తినకూడదని హెచ్చరిస్తున్నారు.

ఒకవేళ తింటే ఆరోగ్యానికి హాని చేస్తాయి.ఇప్పుడు పచ్చిగా తినకూడని కూరల గురించి తెలుసుకుందాం.

బంగాళాదుంప
బంగాళాదుంపలో సలోనిన్ అనే టాక్సిన్ ఉంటుంది.అందువల్ల పచ్చిగా తింటే గ్యాస్, జీర్ణసమస్యలు, తలనొప్పి, వికారం వంటివి వస్తాయి.అందువల్ల బంగాళాదుంపను ఉడికించి లేదా బేక్ చేసి మాత్రమే తినాలి.

రాజ్మా
రాజ్మాలో ప్రోటీన్స్, యాంటీఆక్సిడెంట్స్,లాక్టిన్ సమృద్ధిగా ఉంటాయి.

ఇవి ఆరోగ్యపరంగా లాభాలను చేకూరుస్తుంది.వీటిని పచ్చిగా తింటే మాత్రం వికారం, వాంతులు, జీర్ణ సమస్యలు, డయోరియా వంటి సమస్యలు వస్తాయి.

కాబట్టి రాజ్మాను ఐదు గంటల పాటు నానబెట్టి ఉడికించి మాత్రమే తినాలి.


పచ్చి పాలు
పచ్చిపాలను త్రాగితే బ్రసెల్లా లిస్టెరియా అనే బ్యాక్టీరియా శరీరంలోకి నేరుగా ప్రవేశిస్తుంది.దాంతో డయేరియా, కడుపు నొప్పి, వాంతులు వంటి సమస్యలు వస్తాయి.కాబట్టి పాలను మరిగించి మాత్రమే త్రాగాలి.

బ్రొకోలీ
బ్రోకలీలో ఆక్సిలిక్ యాసిడ్ ఉంటుంది.ఇది శరీరం ఐరన్, క్యాల్షియంను గ్రహించకుండా అడ్డుకుంటుంది.కాబట్టి వీటిని కాస్త ఉడికించి తీసుకోవడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.విటమిన్స్ పొందవచ్చు.

పుట్టగొడుగులు
వీటిలో కార్సినోజెనిక్‌ సమ్మేళనాలు ఉంటాయి.పచ్చిగా తింటే అవన్నీ మన శరీరంలోకి చేరి శరీరాన్ని విషతుల్యం చేస్తాయి.వీటిని కూడా ఉడికించే తినాలి.

గుడ్లు
పచ్చికోడిగుడ్లలో సాల్మొనెల్లా బాక్టీరియా ఉంటుంది.

ఇది శరీరంలో ఇన్‌ఫెక్షన్లను కలిగిస్తుంది.కాబట్టి గుడ్లను ఉడకబెట్టి లేదా ఆమ్లెట్‌ రూపంలో తినాలి.

ఆలివ్స్
ఆలివ్స్ కొద్దిగా గ్రీన్ లేదా బ్లాక్ కలర్ లో ఉంటాయి.ఆలివ్స్ ప్రొసెస్ చేసినవి, పికెల్ రూపంలో మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి.ఇవి పచ్చివి కావు, మరియు తినడానికి సురక్షితమైనవి.అయితే నేరుగా చెట్టు నుండి కోసి తింటే ఆరోగ్యానికి హాని చేస్తుంది.

పచ్చి ఆలివ్స్ లో ఉండే ఓలిరోపిన్ సమ్మేళనం ఫుడ్ పాయిజన్ కి గురి చేస్తుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు