ఉపనయనం ఎందుకు పాటిస్తారు అంటే ఏమిటి? ఎందుకు చేస్తారు?

బాల్యం విడిచి కౌమారంలోకి అడుకుపెట్టే సమయంలో ఉపనయనం చేస్తారు.ఉపనయనంతో బ్రహ్మచర్య దీక్షను ఇస్తారు.

వేదాభ్యాసానికి ముందు ఉపనయనం చేస్తారు.దీనిని ఒడుగు అని కూడా అంటారు.

అప్పటివరకు నియమ నిష్ఠలతో పనిలేకుండా సంచరించే బాలుడు.నియమ నిష్ఠలతో కూడిన జీవితంలో ప్రవేశించడానికి చేసే శాస్త్రీయమైన ప్రక్రియ ఉపనయనం.

బ్రహ్మణులలో ఉపనయనానికి ముందు ఒక జన్మ, తర్వాత మరో జన్మగా వ్యవహరిస్తారు.అందుకే ఒడుగుకు బ్రహ్మణులు అధిక ప్రాముఖ్యతనిస్తారు.

Advertisement

క్షత్రియులు, వైశ్యులతో పాటు పలు కూలాల వారు ఇప్పటికీ ఉపనయనం ఆచరిస్తున్నారు.చాలా వరకు ఈ తంతు ఇప్పుడు ఒక వివాహపూర్వ తంతుగా మారింది.

పూర్వకాలం గురుకులాభ్యాసం చేసే అలవాటు ఉన్నందు వల్ల ఉపనయనం చేసేన తర్వాతే గురుకుల అభ్యాసానికి పంపేవారు.

ఈ ఉపనయనం అయ్యే వరకు ఎటువంటి ధర్మకార్యం నెరవేర్చడానికైనా అనర్హులు.అప్పటి వరకు అల్లరల్లరిగా తిరిగే బాలురు ఉపనయనం తర్వాత విధిగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది.ఉపనయనం జరిగిన నాటి నుండి.

నిత్యం గాయత్రి దేవినీ పూజిస్తూ బ్రహ్మచర్యం పాటించాలి.వివాహానికి ముందు బ్రహ్మచర్యాన్ని వదిలి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
These Face Packs Help To Get Smooth Skin Details Face Packs

గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తారు.

Advertisement

తాజా వార్తలు