Medaram : మేడారం జాతరకు భారీ బందోబస్తు చేసిన పోలీసులు.. 500 సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా..

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయినా మేడారం జాతర( Medaram Jatara ) గురించి మనందరికీ తెలిసిందే.అయితే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివస్తుంటారు.

 Police Force Ready For Medaram Maha Jatara 2024-TeluguStop.com

అందుకు అనుగుణంగానే ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది.ఈ ఏడాది నేర రహితంగా నిర్వహించాలని భావిస్తున్నట్లు కూడా ములుగు జిల్లా పోలీసులు సూపరిడెంట్( Mulugu District Superintendent ) మీడియాకు తెలిపారు.

అయితే 20 సెక్టార్లలో నాలుగు కిలోమీటర్ల మేర జాతర నిర్వహిస్తున్నట్లు అలాగే ట్రాఫిక్ సజావుగా ఉండేలా ప్రత్యేక ట్రాఫిక్ నియమించారని తెలిపారు.ఇక జాతరలో మొదటిసారి పోలీసు సిబ్బంది ఎల్ఎన్ టీ నుండి కొత్త సాంకేతికతను ఉపయోగించుకుంటున్నారు.

Telugu Cc Cameras, Devotees, Devotional, Medaram, Medaram Jatara, Mulugu, Force,

ఇది సమస్యల గురించి మేడారంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్( Medaram Command Control Center ) కు హెచ్చరిస్తుంది.ఇక అధికారులు స్పందించడానికి ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు వీలు కల్పిస్తుంది.అంతేకాకుండా 500 సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.ఇక జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ క్రైమ్ స్టేషన్ నుండి 500 మందికి పైగా పోలీసులకు వివిధ విధులు కేటాయించినట్లు కూడా తెలిపారు.

ఈ అధికారులు బృందాలుగా ఏర్పడి నేరాల హాట్ స్పాట్లను గుర్తిస్తారు.ఇక సురక్షితమైన ఊరేగింపును నిర్ధారించడానికి అవసరమైన చర్యలు కూడా తీసుకుంటారు.భక్తుల రద్దీని గమనించడానికి ఎల్ఈడి స్క్రీన్( LED Screens ) లను ఏర్పాటు చేశారు.

Telugu Cc Cameras, Devotees, Devotional, Medaram, Medaram Jatara, Mulugu, Force,

భక్తుల రాక సందర్భంగా ఎలాంటి తొక్కిసలాట జరగకుండా క్యూ లైన్ లో కూడా ఏర్పాటు చేశారు.ఇక ములుగులోని ఘట్టమ్మ దేవాలయం మేడారం మధ్య 12 ట్రాఫిక్ సహాయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు.అయితే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర నివారణ కోసం నూతనంగా నియామకమైన కమిటీ చైర్మన్ తో సహా 14 మంది సభ్యులు సమ్మక్క సారక్క దేవతల సన్నిధి( Sammakka Sarakka )లో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి బాధ్యతలు స్వీకరించడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube