Bhaktalapuram Brothers Govt Jobs : అమ్మమ్మ కూలిపని.. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ముగ్గురు మనవళ్లు.. గ్రేట్ అంటూ?

ఒక కుటుంబంలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగం( Government Job ) సాధించాలంటే ఎంతో కష్టపడాలి.ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అంటే మాత్రం సులువైన విషయం కాదు.

 Bhaktalapuram Village Brothers Who Got Three Government Jobs Inspirational Succ-TeluguStop.com

అయితే సూర్యాపేట జిల్లాకు( Suryapet District ) చెందిన ముగ్గురు అన్నాదమ్ములు మాత్రం రేయింబవళ్లు ఎంతో కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే కలను నెరవేర్చుకోవడంతో పాటు నేటి తరం యువతకు స్పూర్తిగా నిలిచారు.

సూర్యపేట జిల్లాలోని భక్తలాపురంకు( Bhaktalapuram ) చెందిన సైదాచారి, రామ్ ప్రసాద్, రాజశేఖర్ బాల్యం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు.

ఒకానొక సమయంలో తిండికి సైతం ఈ ముగ్గురు అన్నాదమ్ములు ఇబ్బందులు పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.బాల్యంలోనే ఈ ముగ్గురు యువకులు తల్లీదండ్రులను కోల్పోగా అమ్మమ్మ రాములమ్మ( Grandmother Ramulamma ) కూలిపని చేస్తూ తన రెక్కల కష్టంతో ముగ్గురు యువకులను ప్రయోజకులను చేసింది.

Telugu Job, Jobs, Teacher, Rajashekar, Ram Prasad, Saidachari, Story, Suryapet-I

ఆర్థికంగా ఎన్నో సవాళ్లు ఎదురైనా మనవళ్లపై ప్రేమతో అమ్మమ్మ వాళ్లను చదివించారు.రాములమ్మ తమ కోసం పడుతున్న కష్టాన్ని చూసి మంచి ఉద్యోగాలను సాధించాలని ముగ్గురు మనవళ్లు లక్ష్యంగా పెట్టుకున్నారు.పదేళ్ల క్రితమే రామ్ ప్రసాద్,( Ram Prasad ) రాజశేఖర్( Rajashekar ) పోలీస్ బెటాలియన్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.సైదాచారి( Saidachari ) గత కొన్నేళ్లుగా ప్రైవేట్ టీచర్ గా పని చేస్తుండగా తాజాగా మ్యాథ్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు.

Telugu Job, Jobs, Teacher, Rajashekar, Ram Prasad, Saidachari, Story, Suryapet-I

ముగ్గురు యువకులు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడంతో గ్రామస్తులు వాళ్లను అభినందిస్తున్నారు.అమ్మమ్మ రాములమ్మ పడిన కష్టానికి ముగ్గురు యువకులు సాధించిన ప్రభుత్వ ఉద్యోగాల రూపంలో ప్రతిఫలం దక్కింది.ఇప్పటికే లక్ష్యాలను సాధించిన ఈ ముగ్గురు యువకులు రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత ఎదగాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.గ్రామంలోని మిగతా విద్యార్థులు సైతం ఈ ముగ్గురు యువకులను స్పూర్తిగా తీసుకుని వాళ్ల సలహాలతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube