Bhaktalapuram Brothers Govt Jobs : అమ్మమ్మ కూలిపని.. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ముగ్గురు మనవళ్లు.. గ్రేట్ అంటూ?
TeluguStop.com
ఒక కుటుంబంలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగం( Government Job ) సాధించాలంటే ఎంతో కష్టపడాలి.
ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అంటే మాత్రం సులువైన విషయం కాదు.
అయితే సూర్యాపేట జిల్లాకు( Suryapet District ) చెందిన ముగ్గురు అన్నాదమ్ములు మాత్రం రేయింబవళ్లు ఎంతో కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే కలను నెరవేర్చుకోవడంతో పాటు నేటి తరం యువతకు స్పూర్తిగా నిలిచారు.
సూర్యపేట జిల్లాలోని భక్తలాపురంకు( Bhaktalapuram ) చెందిన సైదాచారి, రామ్ ప్రసాద్, రాజశేఖర్ బాల్యం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు.
ఒకానొక సమయంలో తిండికి సైతం ఈ ముగ్గురు అన్నాదమ్ములు ఇబ్బందులు పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
బాల్యంలోనే ఈ ముగ్గురు యువకులు తల్లీదండ్రులను కోల్పోగా అమ్మమ్మ రాములమ్మ( Grandmother Ramulamma ) కూలిపని చేస్తూ తన రెక్కల కష్టంతో ముగ్గురు యువకులను ప్రయోజకులను చేసింది.
"""/" /
ఆర్థికంగా ఎన్నో సవాళ్లు ఎదురైనా మనవళ్లపై ప్రేమతో అమ్మమ్మ వాళ్లను చదివించారు.
రాములమ్మ తమ కోసం పడుతున్న కష్టాన్ని చూసి మంచి ఉద్యోగాలను సాధించాలని ముగ్గురు మనవళ్లు లక్ష్యంగా పెట్టుకున్నారు.
పదేళ్ల క్రితమే రామ్ ప్రసాద్,( Ram Prasad ) రాజశేఖర్( Rajashekar ) పోలీస్ బెటాలియన్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
సైదాచారి( Saidachari ) గత కొన్నేళ్లుగా ప్రైవేట్ టీచర్ గా పని చేస్తుండగా తాజాగా మ్యాథ్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు.
"""/" /
ముగ్గురు యువకులు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడంతో గ్రామస్తులు వాళ్లను అభినందిస్తున్నారు.
అమ్మమ్మ రాములమ్మ పడిన కష్టానికి ముగ్గురు యువకులు సాధించిన ప్రభుత్వ ఉద్యోగాల రూపంలో ప్రతిఫలం దక్కింది.
ఇప్పటికే లక్ష్యాలను సాధించిన ఈ ముగ్గురు యువకులు రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత ఎదగాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
గ్రామంలోని మిగతా విద్యార్థులు సైతం ఈ ముగ్గురు యువకులను స్పూర్తిగా తీసుకుని వాళ్ల సలహాలతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తున్నారు.
త్రివిక్రమ్ వివాదం… నటుడు శివ బాలాజీకి కౌంటర్ ఇచ్చిన పూనమ్ కౌర్?