సాధారణంగా 60 ఏండ్లు దాటిన జనాలకు ముసలి తనం వస్తుంది.బాడీలో కాస్త శక్తి తగ్గుతుంది.
గ్లామర్ డీలా పడుతుంది.కానీ సినిమా తారలు మాత్రం 60 ఏండ్లు నిండినా ఇంకా కుర్రాళ్లాగే కనిపించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు.
ఇందుకోసం ప్రత్యేకంగా ఫుడ్ హాబిట్స్ పాటిస్తారు.జిమ్ముల్లో గంటల తరబడి కష్టపడతారు.ఇంతకీ ఆరు పదుల వయసు వచ్చినా.25 ఏండ్ల కుర్రాళ్లతో పోటీ పడుతున్న హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
నాగార్జున
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున.వయసు 60 ఏండ్లు దాటినా.ఇంకా కుర్ర హీరోలాగే కనిపిస్తాడు.ప్రస్తుతం ఉన్న సీనియర్ టాలీవుడ్ నటుల్లో ఈయన అంత ఫిజిక్ మెయింటెన్ చేసే హీరో మరొకరు లేరని చెప్పవచ్చు.ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు సినిమా కోసం ఫర్ఫెక్ట్ లుక్ కోసం పర్సన్ ట్రైనింగ్ తీసుకుటున్నాడు.ఉన్న అందానికి మరింత మెరుగులు పెట్టుకుంటున్నాడు.
వెంకటేష్
60 సంవత్సరాలు దాటినా వెంకటేష్ కూడా సేమ్ బాడీ షేప్ మెయింటెన్ చేస్తున్నాడు.తన లుక్ లో ఏ మాత్రం మార్పులు రాకుండా చూసుకుంటున్నాడు.యంగ్ హీరోలకు ధీటుగా నిలుస్తున్నాడు.
చిరంజీవి
ఆరుపదుల వయసు దాటినా ఇప్పటికీ యంగ్ లుక్ లో ఆకట్టుకుంటాడు.అద్భుత డ్యాన్సులతో తనలో గ్రేస్ ఇంకా తగ్గలేదని నిరూపిస్తున్నాడు.తాజాగా ఆచార్య సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా అద్భుతంగా చేస్తున్నాడు.చక్కటి గ్లామర్ తో పాటు బాడీ షేపింగ్ మీద కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడు.
రజనీకాంత్- కమల్ హాసన్
అటు రజనీకాంత్ సైతం 70 ఏండ్ల వయసును దాటాడు.అయినా తన బాడీ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.స్ట్రిక్ట్ డైట్ ఆచరించడంతో పాటు యోగా తప్పకుండా చేస్తారు.
అటు 66 ఏండ్లున్న కమల్ హాసన్ సైత్ తన బాడీ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటాడు.స్లిమ్ గా ఉండటం కోసం.ఫుడ్ విషయంలో చాలా నిబంధనలు పాటిస్తున్నాడు.
అమితాబ్ బచ్చన్
అటు బాలీవుడ్ లో ఇప్పటికీ చాలా చలకీగా ఉంటాడు సీనియర్ స్టార్ అమిత్ బచ్చన్.ప్రతిరోజు వ్యాయామం, యోగా తప్పకుండా చేస్తాడు బిగ్ బీ.అటు అనిల్ కపూర్ కూడా చాలా కాలంగా ఒకేలా కనిపిస్తున్నాడు.పర్సనల్ ఫిట్ నెస్ ట్రైనర్ తో జిమ్ లో కుస్తీ పడతాడు.సంజయ్ దత్ కూడా యంగ్ లుక్ లో కనిపిస్తున్నాడు.ప్రస్తుతం కేజీఎఫ్-2 కోసం తగు కసరత్తులు చేస్తున్నాడు.అటు సునీల్ శెట్టి సైతం మంచి ఫిట్ నెస్ మెయింటెన్ చేస్తున్నాడు.