కొన్ని ఆహార కలయికలు శరీరానికి ఒక వరములా పని చేస్తే, మరికొన్ని ఆహార కలయికలు తినడం ద్వారా ప్రతికూల ప్రభావం చూపిస్తాయి.కొన్ని ఫుడ్ కాంబినేషన్లు మనకు రుచికరంగా అనిపించడంతో పాటు ప్రయోజనకరంగాను కూడా అనిపిస్తాయి.
అయినప్పటికీ కొన్ని ఫుడ్ కాంబినేషన్లు తినడం ప్రాణాంతకం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.కాబట్టి కొన్ని ఫుడ్ కాంబినేషన్లు ని అసలు తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మరి ఆ కాంబినేషన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు, సిట్రస్ పండ్లు:
నిమ్మ, నారింజ లాంటి సిట్రస్ పండ్ల( Citrus fruits )లో యాసిడ్ ఎక్కువగా ఉంటుంది.ఇవి తిన్న వెంటనే పాలు తీసుకుంటే అవి కడుపులో విరిగిపోతాయి.దీంతో శరీరంలో జీర్ణ సంబంధిత సమస్యలు( Digestive problems ) తలెత్తుతాయి.

చేపలు, పాలు:
పాలు, చేపలు రెండు విభిన్న స్వభావం కలిగిన ఆహారాలు.కాబట్టి చేపలు వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి.ఇక పాలెమో చలువ చేస్తాయి.వీటిని ఒకే సమయంలో తీసుకోవడం వలన శరీరంలో రసాయన మార్పులకు కారణం అవుతుంది.దీంతో చర్మంపై పిగ్మేటేషన్ సమస్యల( Pigmentation )ను కలిగిస్తుంది.
ఆహారం, పండ్లు:
ఆహారం తిన్న వెంటనే పండ్లను తింటే శరీరం లో క్యాలరీలు పెరుగుతాయి.కాబట్టి అన్నం తిన్న వెంటనే పండ్లను అసలు తినకూడదు.ఇది శరీరానికి హాని కలిగిస్తుంది.
కొవ్వు మాంసం, జున్ను:
అయితే సంతృప్త కొవ్వు ఉన్న మాంసంతో పాటు చీజ్ తీసుకోవడం వలన శరీరంలో అధిక స్థాయిలో సంతృప్త కొవ్వు సోడియం ఏర్పడుతుంది.ఇది గుండె జబ్బు( Heart disease )ల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

చీజ్ ఫుడ్, శీతలపానియాలు:
ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా చీజ్ ఫుడ్, శీతలపానియాలు తాగుతున్నారు.రుచిగా ఉంటుందనే కారణంగా అందరూ వీటిని తాగేస్తున్నారు.కానీ ఇలా చేయడం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది.దీనివలన కడుపునొప్పి, ఇతర సమస్యలతో బాధపడాల్సి వస్తుంది.కాబట్టి ఎప్పటికీ కూడా ఈ ప్రమాదకరమైన ఫుడ్ కాంబినేషన్స్ ను తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు.