శిబిరాన్ని ప్రారంభించిన తాజా మాజీ ఉప సర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని రైతు చర్చ మండలిలో ప్రతిమ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం అయింది.
మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతం కావడం పట్ల కళాశాల మార్కెటింగ్ చైర్మన్ కౌశిక్,ఒగ్గు బాల రాజు యాదవ్ ను అభినందించారు.ఈ కార్యక్రమoలో వైద్య బృందం విశేష సేవలు అందించారు.
ఈ ఉచిత శిబిరానికి 300 ల మంది హాజరయ్యారు .ఇందులో జనరల్ ఫిజీషియన్, పిల్లల వైద్య నిపుణులు, ఎముకల వైద్య నిపుణులు, స్త్రీ వైద్య నిపుణులు, జనరల్ సర్జన్ తోపాటుగా వివిధ టెస్టులు చేయడానికి వచ్చిన సిబ్బంది వచ్చిన రోగులకు విశిష్టమైన సేవలు అందించారు.ఈ శిబిరంలో ఉచితంగా క్యాంప్ కు హాజరైన రోగులకు 2.50 లక్షల రూపాయల మందులు అందజేశారు .ఏర్పాటుకు సహకరించిన ప్రతిమ హాస్పిటల్ ప్రేమ్ సాగర్ రావు, సీఈవో ప్రసాద్ రావు ఏరియా కోఆర్డినేటర్ బాల్ శంకర్ కు క్యాంప్ ఏర్పాటుకు సహకరించిన వీరికి క్యాంపు ఆర్గనైజర్ ఒగ్గు బాల రాజు యాదవ్ ధన్యవాదాలు తెలిపారు.దీనితో పాటు వైద్య శిబిరం ఏర్పాటుకు వసతి సౌకర్యం కల్పించడానికి సహకరించిన రైతు చర్చ మండలి అధ్యక్షులు చందుపట్ల రాజిరెడ్డి ,నేవూరిశ్రీనివాస్ రెడ్డి మండల రెడ్డి సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షులు గన్న మల్లారెడ్డి లకు ఒగ్గు బాలరాజు యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు