హిందూ సంప్రదాయాల ప్రకారం మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు.గ్రామ దేవతలు అయితే.
ఊరి చివరన లేదా పొలిమేరల్లో.అదే ఆంజనేయ స్వామి గుడి ఉయితే ఊరి మధ్యలో ఉండటం మనకు తెలిసిన విషయమే.
అయితే చాలా వరకు అంటే ఎక్కువగా గుడులు కొండలపై లేదా గుట్టలపై ఉండటం మనం చూస్తూనే ఉంటాం.దాదాపుగా ప్రతీ పల్లెలో గుట్టపై ఏదో ఒక దేవుడు కొలువై ఉండటం మనకు తెలిసిందే.
అయితే అలా ఎక్కువగా గుట్టలు,కొండలపై దేవుడి గుడులు ఎందుకు ఉంటాయో మాత్రం చాలా మందికి తెలియదు.అయితే దానికి కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
దేవుడు ఎక్కుడున్నా మన బాధలు విని కోరికలను నెరవేరుస్తాడు.అయితే మన సమస్యలు తీర్చే ఈ భగవంతుడి కోసం మనం ఏమైనా చేయగలామా లేదా పరీక్షించేందుకు దేవుడు కొండలు,గుట్టలపై ఉంటాడు.
మనిషి,పశువు,రాయి,చెక్క అందరూ జీవులే.దేవుడి విగ్రహం,కల్యాణ మండపం,రాయితోనే చెక్కుతారు.అదే రాయి వధ్య శిలగా శ్మశాన శిలగా ఉంటుంది.అదే పరమాత్ముని లీల.అంతే కాదండోయ్ కొండలను, గుట్టలను ఉద్ధరించాలని స్వామికి కోరిక ఎక్కువ అని పురాణాలు చెబుతున్నాయి.అందుకే భగవంతుడు వాటిపై నివాసం ఉంటాడట.
అయితే దేవుడు ఎక్కుడున్నా భక్తులు అక్కడికి వెళ్తుంటారు.భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు.
అంతే కాకుండా కొండలు,గుట్టలు దేవుడి, భక్తుల పాద స్పర్శలతో తరిస్తాయంట.అందుకే రుషులు…కొండలుగా పుట్టాలని కోరికలు కోరుకుంటారట.
తపస్సు చేసి మరీ తమపై కొలువుండాలని వేడుకుంటారట.వారి కోరికలను తీర్చేందుకు కూడా స్వామి వారు కొండలపై కొలువుదీరుతారంట.