ముఖ్యంగా చెప్పాలంటే కార్తీక మాసం( Karthika masam )లో దీపాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.అలాగే ప్రవహించే నదులలో దీపాలను వదలడం,ఇంట్లో దేవుని దగ్గర, తులసి దగ్గర, ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టడంతో పాటు సూర్యాస్తమయం కాగానే ఇంటి ద్వారం దగ్గర దేవాలయాలలో దీపాలను వెలిగిస్తూ ఉంటారు.
కార్తిక మాసంలో దీపం వెలిగించడానికి ఎంతో విశిష్టత ఉందని పండితులు చెబుతున్నారు.దీపదానం అంటే వెండి, బంగారం, ఇత్తడి, ఉసిరికాయ, పిండి సాల గ్రామంతో ఇలా రకరకాలుగా ఇస్తారు.
షోడశదానాల్లో విశేషమైన దీపదానం ఇవ్వాలి అనుకున్న వారు బియ్యపు పిండితో గాని, గోధుమ పిండితో గాని, ప్రమిదను తయారుచేసి అందులో ఆవు నేతిని పోసి పొత్తులను వేసి వెలిగించి ఆ దీపాన్ని బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి.

ఈ దీపదానం వల్ల విద్య, దీర్ఘాయుష్షు, సకల సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే ఆవు నేతి దీపాన్ని దానం ఇస్తే ముక్తి లభిస్తుంది.నువ్వుల నూనె దీపాన్ని ఇస్తే సంపదలు, కీర్తి లభిస్తాయని పండితులు చెబుతున్నారు.
అలాగే దీప దాన విషయాలలో వత్తుల సంఖ్య కూడా ప్రధానమే అని పండితులు చెబుతున్నారు.ఒక వత్తి దీపాన్ని దానం ఇచ్చిన వారు తేజస్వంతులు, బుద్ధిమంతులవుతారని నిపుణులు చెబుతున్నారు.
అలాగే నాలుగు వత్తుల దీపాన్ని ఇచ్చినవారు భూపతి అవుతారని చెబుతున్నారు.పది వత్తులు దీపాన్ని ఇచ్చినవారు చక్రవర్తులు అవుతారని చెబుతున్నారు.

అలాగే 50 వత్తుల దీపాన్ని ఇచ్చిన వారు దైవత్వాన్ని పొందుతారు.100 వత్తుల దీపాన్ని ఇచ్చిన వారు విష్ణు సాయుజ్యాన్ని పొందుతారని నిపుణులు చెబుతున్నారు.దీప దానం అనేది ఎవరైనా ఎప్పుడైనా చేయవచ్చు.పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరించి పూజించి దాన్ని తగిన దక్షిణ తాంబూలంతో పేద బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి.ఇంకా చెప్పాలంటే సాయంత్రం సమయంలో దీప దానం చేస్తే ఇంకా మంచిది.స్తోమత ఉంటే వెండి ప్రమిదలలో బంగారం బొత్తివేసి కూడా దానం చేయవచ్చు.
కానీ దీపదానాన్ని శివాలయం( Lord shiva )లో కానీ, వైష్ణవ దేవాలయంలో కాని ఇవ్వడం మంచిదని పండితులు చెబుతున్నారు.