ఆషాడ మాసం లోనే ఏకాదశి ( Ekadashi) నుండి కార్తీక మాసం లోనే ఏకాదశి వరకు ఉండే కాలాన్ని చాతుర్మాస కాలంగా పరిగణిస్తారు.అయితే మత విశ్వాసాల ప్రకారం చాతుర్మాస కాలంలో ( Chaturmasam )విష్ణువు నిద్రలోకి వెళ్లిపోతారు అని అందరూ నమ్ముతారు.
ఈ సమయం సంవత్సరం లో దాదాపు నాలుగు నెలల పాటు ఉంటుంది.ఇక ఈ ఏడాది చాతుర్మాస కాలం జూన్ 29వ తేదీన ప్రారంభమవుతుంది.
ఇక ప్రారంభమై 23వ తేదీ వరకు కొనసాగుతోంది.అయితే నాలుగు నెలల పాటు ఇది కొనసాగుతోంది.
కాబట్టి దీన్ని చాతుర్మాసం అని అంటారు.
చాతుర్మాస్య ఉత్సవాలు ( Chaturmasya festivals )సాధారణంగా ఆషాడ మాసంలో దేవశయన ఏకాదశి నాడు ప్రారంభమై కార్తీకమాసంలో ఉత్థాన ఏకాదశి నాడు ముగుస్తాయి.అయితే శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక నాలుగు మాసాలు చాతుర్మాస కాలాన్ని కలిగి ఉంటాయి.ఈ సమయంలో కొన్ని పనులు చేయడం నిషేధించబడింది.
వాటి గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.చాతుర్మాస కాలంలో శుభకార్యాలు అస్సలు చేయకూడదు.
అలాగే కొన్ని ఆహారాలు కూడా తినకూడదు.అయితే పొరపాటున కూడా చేయకూడని పనులు చేస్తే కచ్చితంగా జీవితంపై చెడు ప్రభావం పడుతుంది.
అయితే ఈ సమయంలో నూతన పనులు ప్రారంభించడం, ప్రారంభోత్సవాలు చేయడం, వివాహ వేడుకలు చేయడం, నిశ్చితార్థం చేసుకోవడం, పిల్లలకు నామకరణం చేయడం, గృహ ప్రవేశాలు చేయడం అస్సలు మంచిది కాదు.చాతుర్మాస కాలంలో మంచం మీద అస్సలు పడుకోకూడదు.ఇక ఈ కాలం లో తులసి మొక్కకు క్రమం తప్పకుండా నీరు సమర్పించాలి.ఇక చాతుర్మాస సమయంలో కొన్ని వస్తువులను తినడం నిషేధించబడుతుంది.అయితే ఈ కాలం లో మాంసం, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయలు మొదలైనవి ఆహారంగా తీసుకోకూడదు.