ఈ హింగ్లాజ్ మాత ఆలయంలో కొండెక్కని దీపం.. ఈ ఆలయ చరిత్ర ఇదే..!

ముఖ్యంగా చెప్పాలంటే హిందూ ఆలయాలలో రాతి లేదా లోహంతో చేసిన విగ్రహాలను పూజిస్తూ ఉంటారు.కానీ ఈ అమ్మవారి దేవాలయం మాత్రం అందుకు భిన్నం అని పండితులు చెబుతున్నారు.

 Kondekkani Lamp In This Hinglaj Mata Temple This Is The History Of This Temple ,-TeluguStop.com

హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా ( Kangra in Himachal Pradesh )జిల్లాలో హింగ్లాజ్ మాతాజీ దేవాలయం ( Hinglaj Mataji Temple )ఉంది.ఇది మన దేశంలోనీ 51 శక్తి పీఠాలలో ఒకటి అని చెబుతున్నారు.

ఈ దేవాలయంలో విగ్రహం ఉండదు.జ్వాలాలే ఇక్కడ దేవుళ్ళు అని స్థానిక భక్తులు చెబుతున్నారు.

ఈ జ్వాలలను భక్తులు పూజిస్తూ ఉంటారు.అమ్మవారి తొమ్మిది రూపాయలకు గుర్తుగా చెబుతున్నారు.

దేవాలయంలోపలా మండుతున్న అతిపెద్ద జ్వాలను జ్వాలా దేవి అమ్మవారిగా కొలుస్తారు.

ఈ తొమ్మిది జ్వాలలకు కారణం ఏంటి? సరిగ్గా ఆ తొమ్మిది ప్రాంతాల్లో మాత్రమే జ్వాలలు ఎందుకు వస్తున్నాయి? ఇలాంటి ప్రశ్నలకు ఇప్పటి వరకు సమాధానాలు దొరకలేదు.కొన్ని సంవత్సరాల నుంచి ఈ వెలుగులు ఇక్కడ అలాగే ఉన్నాయని భక్తులు చెబుతున్నారు.దేవాలయ పురాణాల ప్రకారం ఈ దేవాలయం గురించి తెలుసుకున్న మొగల్ చక్రవర్తి అక్బర్ కూడా ఇక్కడికి వచ్చాడు.

ఇక్కడ నిజంగా అమ్మవారు వెలిశారా? లేదా అని పరీక్షించాడు.ముందుగా కొన్ని నీళ్లు పోయించి జ్వాలలను అర్పించేందుకు ప్రయత్నించాడు.

కానీ జ్వాలలి ఆరిపోలేదు.ఆ తర్వాత సైన్యంతో దేవాలయం లోపలి వరకు నీటి కాలువ తవ్వించాడు.

జ్వాలలా మీదుగా ఎంతసేపు నీరు పారిన ఆరిపోలేదు.దాంతో అక్బర్ (Akbar )ఆశ్చర్యపోయి అమ్మవారి దేవాలయ గోపురం మీదుగా ఒక బంగారు గొడుగు సమర్పించాడు.

కొన్ని శతాబ్దాల క్రితం ఈ దేవాలయం ఉన్న ప్రాంతంలో ఒక ఆవుల కాపరి తన ఆవుల్ని మేపేవాడు.అయితే వాటిలో ఒక ఆవు రోజు సాయంత్రం పాలు ఇచ్చేది కాదు.దాంతో ఆవుపాలు ఎవరు పితుకుతున్నారో తెలుసుకోవాలని మేపేటప్పుడు దాన్నే గమనించేవాడు.అంతలోనే ఆవు అడవిలోకి వెళ్ళింది.దాని వెంట వెళ్లిన కాపరికి అక్కడ ఒక అమ్మాయి ఆవుపాలు తాగుతూ కనిపించింది.కాపరి ఆ అమ్మాయిని చూడగానే పెద్ద కాంతి వచ్చింది.

ఆ వెలుగులో అమ్మాయి మాయమైపోయింది.ఆవుల కాపరి రాజు దగ్గరికి వెళ్లి విషయాన్ని చెప్పాడు.

అప్పుడు రాజు అక్కడికి వెళ్లి పవిత్ర జ్వలలను దర్శించుకొని దేవాలయాన్ని నిర్మించాడు.మరో జానపద కథలో పాండవులు ఈ ఆలయాన్ని కట్టారని చెబుతున్నారు.

Hinglaj Temple History

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube