ఏనుగు కలలో కనిపిస్తే ఏం అవుతుందో తెలుసా?

సాధారణంగా మనం నిద్రపోతున్నప్పుడు అది పగలైనా, రాత్రైనా కలలు రావడం అనేది సర్వ సాధారణమే.కలలో పాములు, సముద్రాలు, మన బంధువులు, లేదా ఎవరితోనైనా గొడవ పడుతున్నట్లు ఇలా ఎన్నో కలలు వస్తూంటాయి.

 Elephant, Dreams, Good Symptoms, Auspicious,-TeluguStop.com

పొద్దున్న లేవగానే ఆ కలల గురించి చర్చించుకుంటాము.కొన్ని చెడు కలలు రావడం వల్ల మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు.

కానీ మీకు ఎప్పుడైనా కలలో ఏనుగులు కనిపించాయా? ఒకవేళ ఏనుగు కనిపిస్తే ఎలాంటి ప్రభావాలు ఉంటాయి? ఇలాంటి విషయాలను ఇక్కడ తెలుసుకుందాం….

భూమి మీద అతి పెద్ద జంతువు ఏనుగు.

ఏనుగు శక్తి ఇంకా ఎంతో గంభీరంగా కనిపిస్తుంది.ఏనుగు కలలో కనిపించడం ఒక శుభసూచకంగా పరిగణిస్తారు.

ఒంటరీ ఏనుగు మీ కలలో కనిపిస్తే, మీరు సాధారణ జీవితం గడుపుతారని సూచిస్తుంది.అలాకాకుండా ఏనుగుల మంద మీ కలలో కనిపిస్తే, ఇతరులతో సహాయం పొందకుండా మీ సొంత ప్రయత్నంలోనే విజయం సాధిస్తారు.

ఏనుగుల దాడి చేస్తున్నట్టు కలలో కనిపిస్తే మీకు సమస్యలు రాబోతున్నాయని సంకేతం.

అంతేకాకుండా ఏనుగు ఒకరిని తొక్కుతున్నట్టు కలలో కనిపిస్తే, మీ సంపదపైన కొందరి అసూయ పడుతున్నారని సంకేతం.

అందువల్ల ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి.ఏనుగు సింహాన్ని తన్నినట్టు కలలో కనిపిస్తే, మీరు శక్తివంతమైన ప్రత్యర్థిని ఓడిస్తారని అర్థం.

ఏనుగు మీద నుంచి కింద పడుతున్నట్టు కలలో కనిపిస్తే మీరు లక్షాధికారి కావచ్చు కానీ రాబోయే రోజుల్లో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడతారు.ఏనుగుకు ఆహారం పెడుతున్నట్లు కలలో కనిపిస్తే మీకు పదోన్నతలు కలుగుతాయి.

ఏనుగు తల కలలో కనిపిస్తే అది శుభ సంకేతంగా పరిగణించవచ్చు.మనం తలపెట్టిన కార్యాలు ఏవైనా కూడా ఏ ఆటంకం లేకుండా, నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి.అంతేకాకుండా మీకు గౌరవం లభిస్తుంది.చెట్లను తొక్కుతూ ఏనుగులు కలలో కనిపిస్తే, మీకున్న కష్టాలు తాత్కాలికం మాత్రమే, త్వరలో విజయం సాధిస్తారని సంకేతం.

ఇటువంటి ఏనుగులు కలలో కనిపించడం శుభప్రదమని, సమస్త పాపాలు, దారిద్ర్యం నశించిపోతాయని ఆధ్యాత్మిక గ్రంథాలలో రచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube