అయ్యప్ప దీక్ష.. అర్యోగ్య రక్ష.. ఎలా అంటే?

కార్తీక మాసంలో భక్తులు అయ్యప్ప మాల ధరించి మకర సంక్రాంతి వరకు నియమనిష్టలతో కఠిన దీక్షలను చేస్తారు.సంక్రాంతి రోజు మకర జ్యోతిని దర్శించుకొని మాలను శబరి ఆలయంలో స్వామి సన్నిధి నందు తొలగించి వస్తారు.

 Health Benefits Of Wearing Ayyappa Deeksha, Ayyappa Deeksha,arogyam,karthika Mas-TeluguStop.com

కానీ ఈ మాలను ధరించిన అన్ని రోజులు ఎంతో నియమ నిష్టలతో స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు.ఇలా కఠిన నియమాలతో ఆచరించే అయ్యప్ప దీక్ష ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించడమే కాకుండా, ఆరోగ్యాన్ని సైతం పెంపొందిస్తుంది.

దీక్షా కాలంలో ఆచరించే నియమనిష్టలతో అయ్యప్ప మాలలను ధరించే స్వాములకు లభించే ఆరోగ్య ఫలితాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

అయ్యప్ప మాల ధరించిన భక్తులు అందరూ వేకువజామున నిద్రలేచి చన్నీటి స్నానాలు ఆచరించి, భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజిస్తుంటారు.ఎలా చన్నీటితో స్నానం చేయడం వల్ల మనస్సు తేలికగా ఉండి భక్తి పై ఏకాగ్రత పెరుగుతుంది.

అంతే కాకుండా ఎన్నో ఆలోచనలతో ఒత్తిడికి గురైన మన మెదడుని సైతం స్నానం చల్లబరుస్తుంది.అంతేకాకుండా దీక్షను ధరించిన వారు ప్రతిరోజు మితంగా ఆహారం తీసుకుంటారు.

మాలలు ధరించిన వారు తినే ఆహారంలో మసాలా దినుసులతో ఉపయోగించకపోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తవు.

Telugu Arogyam, Ayyappa Deeksha, Black, Benefitsayyappa, Karthika Masam, Makara

అయ్యప్ప మాల ధరించిన అన్ని రోజులు చెప్పులు లేకుండా నడవడం ద్వారా పాదాలు ఒత్తిడికి గురై రక్తప్రసరణ,హృదయ స్పందన రేటు మెరుగుపడుతుంది.దీక్షను చేపట్టి భక్తులు పట్టు పరుపుల పై కాకుండా, కటిక నేలపై నిద్రిస్తుంటారు.ఇలా కటిక నేలపై పడుకోవడం ద్వారా రక్త ప్రసరణ జరగడంతో పాటు మనశ్శాంతిగా ఉంటుంది.

భూమిలో కలిగే శక్తి మార్పిడి వల్ల మన శరీరానికి శక్తిని కలిగిస్తుంది.మాల ధరించిన స్వాములు రెండు కనుబొమ్మల మధ్య చందనం తిలకంగా పెట్టు కుంటారు.ఇలా పెట్టుకోవడం ద్వారా ఇతరుల దృష్టి మన పై కేంద్రీకృతమవదు.
అయ్యప్ప మాల ధరించిన వారు నల్లటి దుస్తులను ధరిస్తారు.

సాధారణంగా మాలను చలికాలంలో ధరించడం వల్ల వేడిని గ్రహించి శరీరానికి రక్షణ కల్పిస్తుంది.అంతేకాకుండా శబరిమల యాత్రకు అడవులలో ప్రయాణం చేయటం వల్ల అడవి జంతువుల నుంచి నలుపు రంగు మనకు రక్షణగా ఉండటం వల్ల మాలలను ధరించే వారు నలుపు రంగు దుస్తులను ధరిస్తారు.

ఈ విధంగా అయ్యప్ప మాల ధరించిన వారికి దేవుడి అనుగ్రహం కలగడమే కాకుండా, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube